ఘనంగా గంగమ్మ జాతర వేడుకలు
--గంగమ్మ ని దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు,వేలాది మంది భక్తులు.
--బంధుమిత్రుల రాక తో వెల్లివిరిసిన ఆనందం.
---భేషుగ్గా పోలీసుల పహారా.
కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా జాతర్లకు, ఉత్సవాలకు స్వస్తి చెప్పిన ప్రజలు.. నేడు పట్టణ,మండల లకు ఏమీ తీసిపోకుండా మేము సైతం అన్న రీతిలో పల్లెల్లో కూడా గంగమ్మ జాతర సంబరాలు మిన్నంటుతున్నాయి.
ఈ కోవలోనే అన్నమయ్య జిల్లా చిట్వేలు మండల పరిధిలోని కె ఎస్ అగ్రహారం, చిల్లావాండ్లపల్లి గ్రామాలలో నిన్నటి రోజు నుంచి మొదలైన గంగమ్మ జాతర సంబరాలు ఈ రోజ తెల్లవారుజాము నుంచి ఆయా గ్రామ ప్రజలు సాంప్రదాయ పద్ధతులతో, భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఇల్లు బంధువర్గంతోనూ, మిత్రుల తోనూ కోలాహలంగా మారింది. వయస్సు, హోదాను మరిచి పిల్లలు,పెద్దలు పలక దరువులకు అడుగులు కలిపారు. సాయంత్రం సమయాన బసవన్నల ను అలంకరించుకుని తయారు చేయబడ్డ పందారపు బండ్లు అందరినీ అలరించాయి.
జాతరలో ప్రముఖుల సందడి: జాతరను పురస్కరించుకొని శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, రాజకీయ ప్రముఖులు ముక్కా రూపానంద రెడ్డి, ముద్దా బాబుల్ రెడ్డి, పాటూరి శ్రీనివాసులు రెడ్డి, ఎల్ వి మోహన్ రెడ్డి, చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, చక్రపాణి రెడ్డి, శ్రీధర్ రెడ్డి,తమ్మిద తిరుపాలు, ఎంపీపీ చంద్ర, ఉప ఎంపిపి సుబ్రహ్మణ్యం రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి,దేవరాజు, లింగం లక్ష్మీకర్, సర్పంచులు చేతిపట్టు ప్రసాద్,బాలు, మండల అధికారులు నాయకులు, ఎంపీటీసీలు,సర్పంచులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
చిల్లావాండ్ల పల్లి సర్పంచ్ మేకా జయరాం రెడ్డి, కేస్ అగ్రహారం సర్పంచ్ చేతి పట్టు ప్రసాద్, వైసిపి నాయకులు మోసాటి రామిరెడ్డి తదితర కుటుంబాలలో రాజకీయ ప్రముఖులు భోజన కార్యక్రమాన్ని గావించారు.
ఎస్సై వెంకటేశ్వర్లు కట్టుదిట్టమైన ఏర్పాటు:
మండల పరిధిలో రెండు చోట్ల ఒకరోజు జాతర్లు జరుగుతున్నప్పటికీ స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రెండు గ్రామాల్లోనూ పోలీస్ సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు గావించి శాంతి సామరస్యం మధ్య జాతర ఏర్పాట్లను సమీక్షిస్తూ విధులు నిర్వహించారు.
Comments