దున్నపోతు సాంగ్యం విషయంలో గొడవ నిలిచిపోయిన గంగమ్మ జాతర - బలిజపల్లి లో ఇరువర్గాల మధ్య గొడవలు - పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం.
అన్నమయ్య జిల్లా, రాజంపేట పరిధిలోని బలిజపల్లి లో నిర్వహించే బలిజపల్లి గంగమ్మ జాతరకు గొప్ప ప్రత్యేకత ఉంది. ప్రతి ఏడాది ఏప్రిల్ మాసంలో ఇక్కడ నిర్వహించే జాతరకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు బంధువులు గొప్పగా తరలి వస్తారనడంలో అతిశయోక్తి లేదు.
కాగా ఈ సంవత్సరానికి ఈ నెల 21వ తేదీ గురువారం గొప్పగా జాతర జరగవలసి ఉండగా.. ఆదివారం రాత్రి జాతరలో బలి ఇవ్వనున్న దున్నపోతు సంఘం విషయంలో ఊరిలో కొందరి మధ్య తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలి వానలా తయారై జాతర నిలుపుదలకు కారణమైంది.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక సీఐ వారి బృందంతో గొడవలు నివారించి జాతరపై చర్చించేందుకు ఆర్డీవో తో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. దీంతో ఆశగా ఎదురుచూసిన భక్తుల్లో ఈ సంవత్సరం జాతర ఉంటుందా లేదా అన్న అనుమానం చోటు చేసుకుంది.
Comments