చిట్వేలు గుడిలో కొలువుదీరిన గంగమ్మ.
జాగ్రత్తలు పాటిస్తూ దర్శించుకోవాలని కోరిన నాయకులు,పోలీస్ శాఖ.
---ఘనంగా గంగమ్మ జాతర ఏర్పాట్లు.
--దీపకాంతులు నడుమ పురవీధులు.
---దర్శనానికి బారులు తీరిన భక్తులు.
చిట్వేలు లో అమ్మలగన్న అమ్మ గంగమ్మ తల్లి జాతర ఉత్సవాలను నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తున్నారు.
రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేలి నందు ఈ రోజు జరుగుతున్న గంగమ్మ జాతర ఏర్పాట్లు ఆనందోత్సాహాల నడుమ ఆయా గ్రామ పెద్దలు, ప్రతినిధులు,యువత గొప్పగా ఏర్పాటు చేశారు.
కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా జాతర ఉత్సవాలకు దూరంగా ఉన్న ప్రజలు ఈ రోజు నిర్వహించబోయే జాతర్ల ను ఖుషి ఖుషి గా జరుపుకునేందుకు సుదూర బంధుమిత్రులతో సన్నద్ధమయ్యారు.
జాతర వీక్షించేందుకు వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తమ విలువైన వస్తువులను,తమ పిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిదానం పాటిస్తూ గంగమ్మ తల్లి దర్శించుకోవాలని చిట్వేలు పోలీస్ శాఖ స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు , గ్రామ ఉపసర్పంచ్ చౌడవరం ఉమా మహేశ్వర్ రెడ్డి ,నాయకులు మలిశెట్టి వెంకటరమణ, చౌడవరం సురేంద్రబాబు, మురళి , ఆకేపాటి వెంకటరెడ్డి,బండారు గుండయ్య, యువత కామిశెట్టి సుమన్, హజరత్ రెడ్డి, పగడాల గణేష్, పసల రాజా తదితరులు పెద్దలగా వ్యవహరించి భక్తులందరికీ సూచనలు తెలియజేస్తున్నారు.
Comentários