ప్రసన్న ఆంధ్ర పెదగంట్యాడ ప్రతినిధి, గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా 10.4 % ను కొనసాగించాలి అని, గంగవరం పోర్టు నిర్మాణ సమయంలో మత్స్యకారులుకు ఇచ్చిన హామీలు అయిన జీవనభృతి, జెట్టీ నిర్మాణం, ఉపాధి కల్పన పూర్తిగా అమలుచేయాలని మార్చ్ లో ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశంలో చర్చ జరిగేలా కృషి చేస్తాను - కింజరాపు రామ్మోహన్ నాయుడు ( M.P, శ్రీకాకుళం )
తెలుగు యువత అధ్వర్యంలో శ్రీకాకుళం M P రామ్మోహన్ నాయుడు ని తన నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి, గంగవరం పోర్టు నిర్వాసితుల సమస్యను, మత్స్యకారుల కు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు, గంగవరం పోర్టు నిర్మాణ సమయంలో ప్రభుత్వ అధికారులు నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించి వారు ఏదైతే సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారో, వారి జీవన ప్రమాణాలుకి ఎటువంటి ఆటంకం కలిగించకుండా పూర్తి న్యాయం చేస్తామని, పోర్టు నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి పూర్తయ్యేంతవరకు 3,600 Rs ఒక్కొక్కరికి జీవనభృతి గా ఇస్తామని తెలిపారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి జెట్టి నిర్మాణాన్ని చేపట్టలేదు , వారికి ఇచ్చే జీవన భృతిని కూడా 2010వ సంవత్సరంలో నిలిపివేశారు. సుమారు 20 వేల మంది జనాభా కలిగిన గంగవరం పోర్టు నిర్వాసిత గ్రామాలకు, ఎటువంటి ఉపాధి లేక నిరుద్యోగ సమస్యతో జీవనం సాగిస్తున్నారు. వారి జీవన ప్రమాణాలను దెబ్బతీసి వారికి ఇప్పటివరకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చకుండా , పోర్టులో ఉన్న ప్రభుత్వ వాటాను పూర్తిగా ప్రైవేట్ సంస్థకు అమ్మువేయడం చాలా బాధాకరం అని, ఆందోళన చెందుతున్నారు. గంగవరం పోర్టు వలన చుట్టుపక్కల ప్రాంతాలు గంగవరం వెంకన్నపాలెం, కొంగపాలెం ,పెదగంట్యాడ, H B కాలనీ, గాజువాక పరిసరప్రాంతాలు పోర్టు కాలుష్యం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే తీవ్రమైన అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. గంగవరం పోర్టు ఏర్పాటు చేసినప్పుడు, నిర్వాసిత ప్రాంత ప్రజలను చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో ప్రభుత్వ అధికారులు చర్చలు జరిపి, నేడు ప్రభుత్వ వాటాను పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసినప్పుడు నిర్వాసిత ప్రాంతాల ప్రజలతో చర్చించకుండా, ప్రభుత్వం రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . గంగవరం పోర్టు వలన మత్స్యకారుల జీవితాలు బాగుపడతాయని వాటిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటివరకు కేవలం 600 మంది మాత్రమే ఉపాధి కల్పించి, మిగతా వారికి మొండిచేయి చూపింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వాటాలను పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే నిర్వాసితులు తరఫున ఎవరు పోరాడుతారు. సుమారుగా 2,700 మందికి నిర్వాసితులకు ఇచ్చే జీవనభృతి 10 కోట్లను ప్రభుత్వం 2019 నిలిపివేసింది. దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నిర్వాసితుల హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి తీరుపట్ల , గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను కొనసాగించాలని ఉద్యమాలు చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకార సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని తెలియజేస్తున్నాము, ఈ కార్యక్రమంలో తెలుగు యువత అద్యక్షుడు ఒలిశెట్టి. తాతాజీ , ప్రధానకార్యదర్శి మొల్లి పెంటిరాజు , గాజువాక అధ్యక్షుడు బాలగ . బాలకృష్ణ , ప్రధానకార్యదర్శి ముమ్మడివరపు రాము, 64 వార్డ్ అధ్యక్షుల కొవిరి హరికృష్ణ , ప్రధానకార్యదర్శి కదిరి పోలరాజు పెదపూడి అప్పలస్వామి, చిత్రక జగదీష్, కర్రి క్రిష్ణ, కోన రమణ, చెరుకూరి సుప్రీత్, చందక శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Comentarios