గాజువాక ప్రసన్న ఆంధ్ర విలేకరి
విశాఖపట్నం, 06 ఏప్రిల్ 2022 :దేశంలో అత్యంత లోతైన మరియు అత్యాధునిక నౌకాశ్రయాలలో ఒకటైన గంగవరం పోర్ట్ ఇప్పుడు మరో రికార్డును అల్యూమినియం కడ్డీలను అత్యంత వేగంగా లోడింగ్ చేయడం ద్వారా సాధించింది. గంగవరం పోర్ట్ లిమిటెడ్ (జీపీఎల్), భారతదేశంలో అన్ని వాతావరణ పరిస్ధితుల్లోనూ అత్యంత లోతైన పోర్ట్‌గా ఖ్యాతి గడించడంతో పాటుగా రోజంతా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ పోర్ట్‌లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ పలు రకాల రవాణా వస్తువులను ఎగుమతి, దిగుమతి చేయడంతో పాటుగా లోతైన మల్టీ పర్పస్ కార్గో బెర్త్‌లు కూడా ఉన్నాయి. ఈ పోర్ట్‌లో విస్తృతశ్రేణి నిల్వ సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న గిడ్డంగులలో పలు రకాల వస్తువులను నిల్వ చేయవచ్చు. వీటితో పాటుగా అత్యాధునిక మెటీరియల్ హ్యాండ్లింగ్ వ్యవస్థలు కూడా ఇక్కడ ఉన్నాయి. కార్గో నిర్వహణలో గంగవరం పోర్ట్ లిమిటెడ్ (జీపీఎల్) స్ధిరంగా మెరుగైన ప్రదర్శన కనబరచడంతో పాటుగా నూతన రికార్డులనూ సృష్టిస్తోంది.
*ఈ పోర్ట్‌లో అత్యధికంగా ఒకే రోజులో 6,559 మెట్రిక్ టన్నుల అల్యూమినియం కడ్డీలను వెస్సల్ ఎంఈ సీకాన్ మనీలా లో బెర్త్ నెంబర్ 1 వద్ద లోడ్ చేశారు. భారతదేశంలో మరే ఇతర నౌకాశ్రయంలోనూ ఇంత మొత్తంలో అల్యూమినియం కడ్డీలను ఒక రోజులో లోడ్ చేయలేదు*.
‘‘మా బృందం సాధించిన విజయం పట్ల పూర్తి సంతోషంగా ఉన్నాము. మా కార్గో నిర్వహణ సామర్థ్యం అల్యూమినియం కడ్డీలతో పాటుగా ఇతర వస్తువుల నిర్వహణ పరంగానూ రికార్డులు సృష్టించింది. గంగవరం పోర్ట్ వద్ద మేము ఎప్పుడూ కూడా మా వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందించడానికి కృషి చేస్తూనే ఉంటాము. గంగవరం పోర్ట్ లిమిటెడ్ (జీపీఎల్) గణనీయంగా నగదును భారతీయ దిగుమతి దారులకు ఓషన్ ఫ్రైట్ తగ్గించడం, సమర్థవంతమైన కార్యకలాపాలు, అత్యాధునిక మెటీరియల్ హ్యాండ్లింగ్, ఇవాక్యుయేషన్ వ్యవస్థలు, విస్తృత శ్రేణి నిల్వ ప్రాంగణాలు వంటి వాటితో అన్ని రకాల కార్గోను నిర్వహించడం, విస్తృతశ్రేణి అనుబంధ సదుపాయాలు, వేగవంతమైన టర్న్‌ఎరౌండ్ సమయం, డెలివరీతో అందిస్తుంది’’ అని గంగవరం పోర్ట్ అధికార ప్రతినిధి అన్నారు.
M/s వేదాంత లిమిటెడ్ (అల్యూమినియం కడ్డీల షిప్పర్) ఈ జాతీయ రికార్డు సాధించడం పట్ల తమ కృతజ్ఞతను తెలియజేయడంతో పాటుగా పోర్ట్ మేనేజ్‌మెంట్‌ను, సిబ్బంది, వర్కర్లు, ఈ అసాధారణ అద్భుతం సాధ్యం చేయడంలో తోడ్పడ్డ కాంట్రాక్టర్ M/sసినర్జీ షిప్పింగ్‌ను ప్రశంసించారు.
గంగవరం పోర్ట్ తమ లోతైన డ్రాప్ట్ బెర్త్‌లు, సమర్థవంతమైన కార్యకలాపాల ద్వారా తూర్పు, పశ్చిమ, దక్షిణ, మధ్య భారతదేశంలో మారుమూల ప్రాంతాలకు గేట్‌వేగా నిలుస్తుంది. ఈ పోర్ట్‌లో భారీ వెస్సల్స్‌ను సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యం ఉంది. దీని వల్ల పోర్ట్ వినియోగదారులకు , వ్యాపారస్తులకు గణనీయంగా ఆదా అవుతుంది.
Commentaires