top of page
Writer's pictureEDITOR

ఉత్తమ ధర్మాచరణ పరాయణుడు శ్రీరాముడు


ఉత్తమ ధర్మాచరణ పరాయణుడు శ్రీరాముడు

ధార్మిక ఉపన్యాసం ఇస్తున్న ధర్మాచార్యులు గంగనపల్లి వెంకటరమణ

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలా ఎదగగలడో రామాయణ మహా కావ్యాన్ని చదవడం ద్వారా తెలుసుకోవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ధర్మాచార్యులు గంగనపల్లి వెంకటరమణ తెలియజేశారు. మానవునిగా జన్మించి మహనీయ మూర్తిగా ఎదిగిన శ్రీరామచంద్రుని చరితమే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలో రాజంపేట పట్టణం రెడ్డివారివీధిలో గల శ్రీచౌడేశ్వరిదేవి ఆలయంలో ఐదు రోజులపాటు జరిగే ధార్మిక కార్యక్రమాలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా ధర్మాచార్యులు గంగనపల్లి వెంకటరమణ మాట్లాడుతూ శ్రీరాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో న భవిష్యతి అని పేర్కొన్నారు. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకై ప్రతి యుగంలోనూ భగవంతుడు అవతరిస్తూ ఉంటాడని, అందులో రామావతారం కూడా ఒకటని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రవికుమార్ స్వామి, తొగట వీరక్షత్రియ సేవాసంఘం కార్యదర్శి బొమ్మిశెట్టి నాగభూషణం, గౌరవ సలహాదారు యూ.పీ రాయుడు, రవి కుమార్, లక్ష్మీ నారాయణమ్మ, చాముండేశ్వరి, ఆలయ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


14 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page