రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ - టీడీపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి గంటా నరహరి
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
అధికార పార్టీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని రాజంపేట పార్లమెంటు అభ్యర్థి గంటా నరహరి ఆవేదన చెందారు. అధికార పార్టీ వారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ను అతిక్రమిస్తూ వైసీపీ నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని.. మరోపక్క అధికారులు వారికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ గురువారం రాయచోటి లోని జిల్లా కలెక్టర్ గిరీశా పిఎస్ కు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల రాయుడు, నాయకులతో కలిసి ఘంటా నరహరి ఫిర్యాదును అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను అతిక్రమిస్తూ ఒకపక్క అధికార వైసీపీ నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తుంటే, మరోపక్క అధికారులు వారికి వత్తాసు పలకడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నట్టుగా ఉందని అన్నారు. అధికార పక్షానికి ఒకలా, ప్రతిపక్షానికి మరోలా రూల్స్ ఉంటాయా అని ప్రశ్నించారు. వీటన్నింటిపై అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు, పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తూ మెమరాండం సమర్పించారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా వ్యవహరిస్తున్న అధికార పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని నరహరి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి లీగల్ సెల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments