పెదగంట్యాడ రామచంద్ర నగర్ గ్రామంలో చెత్త పన్ను బలవంతపు వసూళ్లు ఆపాలని అలాగే చెత్త పన్ను రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు ఉదయం 6 గంటలకు 76 వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ ని కలవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందిస్తూ బలవంతపు వసూళ్లు మేము ఎక్కడ చేయమని చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు మేము ప్రతి ఇంటికి వచ్చి అడుగుతాము తప్ప ఎవరిని బలవంతం చేయు మన్నారు . ఇచ్చిన వారి దగ్గర తీసుకుంటాం ఇవ్వకపోతే వదిలేస్తాం తప్ప ఎవరిని బలవంతం చేయవలసిన అవసరం మా కు లేదని అన్నారు.దయచేసి ఎవరూ కూడా చెత్త పన్నులు కట్టొద్దు ఒకవేళ ఎవరైనా బలవంతంగా చెత్త పన్ను వసూలు చేసిన మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వెంటనే వీడియో గాని ,ఫోటోలు కానీ తీసి పెట్టండి వాటిని కమిషనర్ కి పంపడం జరుగుతుంది.
top of page
bottom of page
Commenti