వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
సోమావారం ఉదయం వై.ఎస్.ఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు గొర్రె శ్రీనివాసులు ఆధ్వర్యంలో పట్టణంలోని బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రొద్దుటూరు తహసీల్దారు మరియు మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం నందు ఎమ్మార్వో కి గరీబ్ కళ్యాణ్ యోజన పధకం క్రింద నాణ్యమైన బియ్యం ఉచితంగా ప్రజలకు పంపిణీ చేయాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు గొర్రె శ్రీనివాసులు మాట్లాడుతూ దేశంలో కరోనా వ్యాప్తి దృష్ఠ్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశం ప్రజలకు అందరికి గరీబ్ కళ్యాణ్ యోజన పధకం క్రింద ఉచితంగా నాణ్యమైన బియ్యం అందిస్తోందని, ఈ పధకం ద్వారా దేశంలోని వలస కార్మికులు, పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనకారిగా ఉండి ప్రజల ఆకలి తీర్చేదని, అలాంటి పధకాన్ని కేంద్రం ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వెళ్ళటం సంతోషమని, కానీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బియ్యం ప్రజలకు పంచటం లేదని, దీని వలన వలస కార్మికులు, పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులకు గురువుతున్నారని ఆవేదన చెందారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పధకం పక్కదారి పట్టిందని, సరఫరా అవుతున్న బియ్యం దారి మళ్ళి నల్ల బజారుకు తరలించి కొందరు సొమ్ము చేసుకుంటున్నారని, ఇలాంటి వారికి నాయకులు, అధికారులు కొమ్ముకాసి ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఈ పధకాన్ని అమలు చేయగా, ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ పధకాన్ని నిలిపివేసిందని, తక్షణమే ఈ పథకం ద్వారా నాణ్యమైన బియ్యం ప్రజలకు పంపిణీ చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గొర్రె శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, మండల అధ్యక్షులు బోరెడ్డి సుధాకర్ రెడ్డి, కిసాన్ మోర్చా మండలాధ్యక్షులు నాగరాజు యాదవ్, మండల ఎస్పీ మోర్చా మబ్బు గుర్రప్ప, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గొర్రె కృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comentários