వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ నేడు పదవ తరగతి ఫలితాలు విడుదల చేయగా, వై.ఎస్.ఆర్ జిల్లా ఆరవ స్థానంలో నిలిచింది. కరోనా మహమ్మారి కారణంగా గడచిన రెండు సంవత్సరాలు రాష్టంలో పదవ తరగతి పరీక్షలు జరుపలేదు. అయితే 2021-2022 విద్యా సంవత్సరానికి గాను పకడ్బందీగా పరీక్షలు నిర్వహించిన విద్యాశాఖ, ఎన్నడూ లేని విధంగా పరీక్షలు ముగిసిన ఇరవై ఏడు రోజుల్లోనే ఫలితాలను వెల్లడించింది. వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరులోని స్థానిక వై.ఎం.ఆర్ కాలనీలో గత మూడు దశాబ్దాలుగా నిర్వహించబడుతున్న గౌతమ్ హై స్కూల్(మెయిన్ బ్రాంచ్) నందు పదవ తరగతిలో కె. వేణు (హాల్ టికెట్ 222120030) 586 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ గా నిలిచారు, అలాగే డి. దివ్యశ్రీ (హాల్ టికెట్ 2222119564) 577 మార్కులు సాధించారని పాఠశాల కరెస్పాండెంట్ టి. సుధీర్ నాయుడు తెలియచేసారు. మొత్తం 149 మంది విద్యార్థులు, ఈ విద్యా సంవత్సరానికి గాను హాల్ టికెట్ పొందగా, ఫలితాల్లో మొదటి డివిజన్ నందు 122 మంది, రెండవ డివిజన్ నందు 16 మంది, మూడవ డివిజన్ నందు ఇద్దరు ఉత్తీర్ణులు అయినట్లు తెలిపారు.
Comments