అతని పుట్టుక సహజమే కానీ అతని చావు చరిత్రను సృష్టించింది. సారవంతమైన తెలంగాణ భూభాగంలో పడ్డ నక్సల్బరీ విత్తనమతడు, కులమత దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా పోరాడీ సమానత్వ సమాజాన్ని కాంక్షించిన ధీరుడతడు, అరాచక మనువుగాని మానస పుత్రులకు సింహస్వప్నమతడు.
ఉస్మానియా మట్టికి పట్టుదల నేర్పి విద్యార్థులెoదరికో రోల్ మెడల్ గా నిలిచిన అకడమిక్ మేధావి అతడు, ప్రొఫెసర్లకే పాఠాలు చెప్పిన ఇంటలెక్చ్వల్ అతడు.
సమసమాజాన్ని ఆకాంక్షిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో మనువాద గూండాల చేతిలో అతికిరాతకంగా హత్యగావించబడీ, అన్ని విద్యాలయాల ప్రధాన ద్వారాల ముందు రెపరెపాలాడే ఆలోచనై,ఆశయమై ఏ విద్యార్థి ఎటు పోవాలో దిశానిర్దేశం చేస్తున్న PDSU నిర్మాత కామ్రేడ్ జార్జి రెడ్డి కి వినమ్రంగా విప్లవ జోహార్లు.
Comments