జీవో నెంబర్ 26, 27, 28లను రద్దు చేయాలి
వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 20 సంవత్సరాలుగా గ్రూప్ 3 గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ చేయకుండా, కాంట్రాక్ట్ లేదా కారుణ్య నియామకాలు చేపట్టి, యువతను ప్రభుత్వం సర్వీస్ లో నియమించకపోవడం చాలా దారుణమని బిజెపి ప్రొద్దుటూరు అసెంబ్లీ కో-కన్వీనర్ పర్లపాడు గౌరీ శంకర్ ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 12 2024న 26, 27, 28 జీవోలను ఏకపక్షంగా విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఉద్యోగాలకు టైప్ రైటింగ్ అర్హతను తగ్గించి సీపీటీ కోర్స్ నిబంధన విధించటం దారుణమని, ఇప్పటికే టైప్ రైటింగ్ పాసైన లక్షలాది మంది నిరుద్యోగులకు మొండి చేయి మిగులుతుందని అన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా విడుదల చేసిన పై జీవోలను రద్దుచేసి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలను పాత నిబంధనలు ప్రకారం చేపట్టాలని, లేనిచో ప్రభుత్వం నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా పై జీవులు రద్దు చేసేంతవరకు లక్షలాది మంది యువత, నిరుద్యోగులతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ప్రేమ్ స్వరూప్, భరత్, రాహుల్ పాల్గొన్నారు.
For Video Click Here https://rumble.com/v4ymbyi--262728-.html
Comentários