గోకుల్ నగర్లో దాదాపు పది మంది పై
వీధి కుక్కల దాడి...
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
ఉభయ తెలుగు రాష్ట్రాలలో గత కొద్ది రోజుల నుండి ఏదో ఒక మూల మనుషులపై కుక్కల దాడి సంఘటనలు వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రొద్దుటూరులోని గోకుల్ నగర్ నందు దాదాపు పది మందిపై పిచ్చి కుక్కలు దాడి చేసి గాయపరిచిన సంఘటన సంచలనంగా మారింది.
శుక్రవారం సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు దాదాపు ఏడు మంది కుక్కకాటుకు గురి కాగా, తాజాగా శనివారం ఉదయం మరో ముగ్గురుపై వీధి కుక్కలు దాడి చేసి గాయాలపాలు చేశాయి. ఇదిగో ముక్క - అదిగో కుక్క అన్న చందంగా గోకుల్ నగర్ కు ఇరువైపులా ఉన్న మాంసపు దుకాణాల వద్దకు వీధి కుక్కలు చేరటం కీచలాడటం, దారిన పోయే వారిని వెంటపడటం చేస్తూనే ఉన్నా, సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. అధికారులు ఆదిలోనే తగు చర్యలు తీసుకుని ఉంటే నేడు గోకుల్ నగర్ నందు పది మంది కుక్క కాటుకు గురయ్యే వారు కాదని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హృదయ విధానంగా సంఘటన ఏమనగా... ఏడాదిన్నర వయసు గల చిన్నారిని శుక్రవారం వీధి కుక్క గాయాలపాలు చేసి, చిన్నారి కాళ్లు నోట కరుచుకొని దగ్గరలోని ఖాళీ ప్రదేశానికి లాక్కొని పోవటాన్ని గమనించిన స్థానికులు కుక్కను తరిమి పాప ప్రాణాలు కాపాడారనే చెప్పాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఇక్కడి స్థానికులు కోరుకుంటున్నారు.
Comments