విశాఖపట్నం, పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎం. గోవిందరావు పరవాడ మండలం విశాఖపట్నం సిటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరవాడ పోలీస్ స్టేషన్ ఎస్ఐ బి. రమణయ్య దర్యాప్తు చేసి, క్రైమ్ ఏ సి పి సిహెచ్. పెంటారావు ఆధ్వర్యంలో, సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్స్పెక్టర్ పి. సూర్యనారాయణ సూచనల మేరకు నిందితులైన నూతన కిషోర్ భానువా, 28 సంవత్సరాలు, నందిని భానువా 24 సంవత్సరాలు మరియు బై ముకేష్ చౌదరి 45 సంవత్సరాలు, పి మల్లికార్జున రావు వనజా గోల్డ్ వర్క్స్ గాజువాక, కంగాటి రాజు గాజువాక, బెన్ నా బత్తుల సత్యానంద్ 40 సంవత్సరాలు మరియు డొంక నానాజీ 45 సంవత్సరాలు అను వానిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి చోరీ సొత్తు అయిన 17 తులాల బంగారం, 8 తులాల వెండి మరియు మూడు చరవాణి లను రికవరీ చేసి నిందితులను కోర్టులో హాజరు పరచడమైనది.
ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాది అయినా కొడవటి తాతారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరిలోవ పోలీస్ స్టేషన్ క్రైమ్ ఎస్ఐ గారైన పి. శివ గారు కేసు దర్యాప్తు చేసి ద్వారకా సబ్ డివిజన్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారైన కె. రామారావు గారు సూచనల మేరకు నిందితులైన దుబా ఉమామహేశ్వరరావు 36 సంవత్సరాలు, కోరాడ లక్ష్మణ్ రావు 30 సంవత్సరాలు, పల్లి లక్ష్మణరావు 36 సంవత్సరాలు మరియు వరపు రాంబాబు 39 సంవత్సరాలు అని వారిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి చోరీ సొత్తు అయిన 150 ఎలక్ట్రిక్ కోయల్ లను మొత్తం విలువ 2,25,000 రికవరీ చేసి నిందితులను కోర్టులో హాజరు పరచడమైనది.
Comments