గూగుల్‌నే భయపెడుతోంది.. ఏంటీ ‘చాట్‌జీపీటీ’?
గూగులమ్మ ఇప్పుడు అప్రమత్తం కావల్సిన దశ వచ్చింది! తన అస్థిత్వానికి ముప్పు వాటిల్లుతుందా అని గూగుల్ ఆందోళన చెందుతోంది. కారణం.. చాట్‌జీపీటీ- సాంకేతిక ప్రపంచంలో వచ్చిన సరికొత్త ఆవిష్కరణ! చాట్‌జీపీటీ... కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో తయారైన చాట్‌బాట్ గూగుల్‌కు సవాల్ విసురుతోంది. ఇంకా సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి రాకుండా, ప్రయోగ దశలోనే రెండు వారాల్లో 10లక్షల మంది యూజర్లను దాటిన ఈ చాట్‌జీపీటీని చూసి గూగుల్ అప్రమత్తం కావాల్సిన పరిస్థితి తలెత్తింది. రెండేళ్లలో ఇది గూగుల్‌ను దాటి పోతుందని అనుకుంటున్నారు.
Comments