అటల్ ఇన్నోవేషన్ మిషన్ ప్రాజెక్టులో గోపికృష్ణ విద్యార్థుల ప్రతిభ
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
కడపజిల్లా, పొద్దుటూరులోని స్థానిక దొరసాని పల్లె లో ఉన్నటువంటి గోపికృష్ణ సెంట్రల్ స్కూల్ విద్యార్థులు బెంగళూరు ప్రముఖ ఐటీ కంపెనీ డెల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి నీతి ఆయోగ్ మరియు అటల్ ఇన్నోవేషన్ మిషన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రోగ్రాం నందు ప్రతిభ కనబరిచారు. ఈ కార్యక్రమంలో భారతదేశం మొత్తం నుండి దాదాపు 1000 టీంలు రాగా స్థానిక గోపికృష్ణ సెంట్రల్ స్కూల్ నుండి తొమ్మిదవ తరగతికి చెందినటువంటి హన్సిక, మోక్షిత, మహాలక్ష్మి అనే విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో గర్భవతుల ఎదుర్కొంటున్న సమస్యలు అధిగమించడానికి రూపొందించినటువంటి అత్యాధునిక ప్రాజెక్టు డెల్ కంపెనీ ప్రతినిధులను ఆకర్షించింది. ప్రాజెక్టు టాప్ 2 లో సెలెక్ట్ కావడంతో డెల్ కంపెనీ ప్రతినిధులు వీరికి ప్రతిభ సర్టిఫికెట్లు మరియు మెమెంటోలను అందజేశారు. ఈరోజు స్థానిక గోపికృష్ణ స్కూల్ నందు గోపికృష్ణ విద్యా సంస్థల కరస్పాండెంట్ కోనేటి కృష్ణ ప్రదీప్ రెడ్డి మరియు ప్రిన్సిపల్ గంగయ్య ఆధ్వర్యంలో విద్యార్థులను అభినందించి, వారికి ప్రశంసా పత్రాలను అందించారు. విద్యార్థులు తయారు చేసినటువంటి ఈ ప్రాజెక్టుకు సహకరించిన బయాలజీ సైన్స్ ఉపాధ్యాయురాలు లావణ్య గారిని కరస్పాండెంట్ కృష్ణ ప్రదీప్ రెడ్డి ,ప్రిన్సిపాల్ గంగయ్య, టీచర్లు అభినందించారు.
ఈ సందర్భంగా సైన్సు ఉపాధ్యాయురాలు లావణ్య మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టును మరింత మార్పు చేసి గ్రామీణ ప్రాంతాల గర్భవతులు పడుతున్న ఇబ్బందుల నుంచి వారికి ఉపశమనం, అత్యవసర వైద్యం అందే విధంగా రూపొందిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments