చేనేతలను ప్రభుత్వాలు ఆదుకోవాలి - గొర్రె శ్రీనివాసులు
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
చేనేత కూలీలు గిట్టుబాటు కాని ధరలతో పవర్ లూమ్స్ వలన కూడా అప్పులు పెరిగి, ఆదాయం తగ్గి, ఇతర వృత్తులకు వెళ్లలేక జీవితాలను నెట్టుకొస్తున్నారని, ప్రపంచానికి చేనేతలను దగ్గర చేయాలని ఆలోచనతో 2015వ సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆగస్టు ఏడవ తేదీని జాతీయ చేనేత దినోత్సవం గా గుర్తించిందని, అయితే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో చేనేతలకు మొండి చెయ్యి మిగిలిందని, పథకాలు అమలు కావడం లేదని బిజెపి ప్రొద్దుటూరు కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బిజెపి కార్యాలయం నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రొద్దుటూరు నుండి తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలకు వందల కోట్ల రూపాయల విలువచేసే పత్తి వాటి ఉత్పత్తులు ఎగు మూతి అవుతున్నాయని, అయితే మారిటోరియం కింద ఆ రాష్ట్రాలలో చేనేతలకు లబ్ధి చేకూరుతుంది కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. జిల్లాలోని నాయకులకు చేనేతల పట్ల చేనేత వృత్తి పట్ల సరైన అవగాహన లేకపోవడం మన దురదృష్టం అని, చేనేతలు అవసాన దశలో కూడా జీవనాన్ని సాగిస్తున్నారన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతలకు సబ్సిడీ ఇవ్వటం వలన ఆ రంగం మెరుగుపడుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఓబీసీ జిల్లా జనరల్ సెక్రెటరీ నాగమల్ల నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య, సీనియర్ బిజెపి నాయకులు శరత్ కుమార్ బాబు, పల్లా శ్రీనివాసులు, పల్లా వెంకటసుబ్బయ్య, రామచంద్ర, తదితరులు పాల్గొన్నారు.
Comentarios