కడప జిల్లా, బీజేపీ జిల్లా కార్యదర్శి గొర్రె శ్రీనివాసులు నేడు కడప జిల్లా కలెక్టర్ వి విజయ్ రామ రాజు ఐఏఎస్ ను కలిశారు, రాష్ట్రములో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఏవయినా క్లెయిమ్స్ ఉంటే ముప్పై రోజుల లోపల తెలియచేయాలి అని ప్రభుత్వం కోరటంతో, జిల్లా కలెక్టర్ వి విజయ్ రామ రాజు ఐఏఎస్ కు ప్రొద్దుటూరు ను జిల్లాగా ఏర్పాటు చేయాలి అని వినతి పత్రం సమర్పించారు, అలాగే ప్రొద్దుటూరు మాజీ మునిసిపల్ కమీషనర్ రాధా హయాంలో దాదాపు ముప్పై కోట్ల రూపాయల మునిసిపల్ నిధులు దుర్వినియోగం అయ్యాయని, దానికి సంబంధించిన పూర్తి వివరాలు జిల్లా కలెక్టర్ కి సమర్పించామని, 2021 లో అవినీతి నిరోధక శాఖకు కూడా వాటికి సంబంధించిన పిర్యాదులు పంపామని, వాటి ప్రతిని కలెక్టర్ వి విజయ్ రామ రాజు ఐఏఎస్ కి సమర్పించామని, ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ తక్షణమే తగిన చర్యలకు ఉపక్రమిస్తామని సంబంధిత శాఖను కోరతామని తెలిపారన్నారు. ప్రొద్దుటూరు రురల్ పరిధిలో అనధికార లేఔట్స్ వెలుస్తున్నాయని కాంట్రాక్టర్లతో అధికారులు లోపాయికారి ఒప్పందాల వలన వ్యక్తిగత లాభాలు చేకూరుచుకుంటున్నారని తెలిపారు, జమ్మలమడుగు RDO శ్రీనివాసులుకు దీనికి సంబంధించిన చర్యల గురించి కలెక్టర్ వి విజయ్ రామ రాజు ఐఏఎస్ శాఖా పరంగా తెలపనున్నారని, ఈ సందర్భంగా గొర్రె శ్రీనివాసులు తెలిపారు.
top of page
bottom of page
Commenti