ఏది వాస్తవం ఏది అవాస్తవం
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
ఆదివారం ఉదయం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకుడు గోసా మనోహర్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు, నిన్న టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు బి. లక్ష్మి నారాయణమ్మ వైసీపీ నాయకులపై చేసిన వ్వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎస్పీ సామాజిక వర్గానికి చెందిన కిశోర్ అనే వ్యక్తి పై చేసిన దాడిని తప్పుబట్టారు, టీడీపీ నాయకులు ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి జీవీ ప్రవీన్ కుమార్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ దాడి జరిగినట్లు ఆయన ఆరోపణలు చేశారు.
అయితే లక్ష్మి నారాయణమ్మ ఆరోపించినట్లు కిశోర్ అనే వ్యక్తి మద్యం సేవించి మారణాయుధాలతో దాడి చేయటానికి ప్రయత్నించినట్లు, అలాగే రాజకీయంగా కక్ష సాధింపు చర్యలో భాగంగా తమ నాయకుడు ప్రవీణ్ రెడ్డి పై ఎస్పీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని అనటం హాస్యాస్పదం అని, దాడి జరుగుతున్న సమయంలో అతని మద్యం సేవించ లేదని, అతని వద్ద ఎటువంటి మారణాయుధాలు లేవని స్పష్టం చేశారు. ప్రవీణ్ పై నమోదు చేసిన ఎస్పీ ఎస్టీ అట్రాసిటీ కేసులో తమ వైసీపీ నాయకులకు ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. కావున ఇకనైనా తమ నాయకులపై అసత్య ఆరోపణలు చేయరాదని, టీడీపీ నాయకులు ఎస్పీ ఎస్టీలపై అగౌరవంగా ప్రవర్తించటం, దాడులకు పాల్పడటం మానుకోవాలని పిలుపునిచ్చారు.లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
Comments