కౌతాళం మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి నందు 24 గంటలు డాక్టర్లు ఆసుపత్రిలో ఉండాలి అని సిపిఎం డిమాండ్ చేసింది.
22.3.2022న కౌతాళం డిప్యూటీ తహసీల్దార్ గారికి ప్రభుత్వ ఆసుపత్రి నందు డాక్టర్లు రెగ్యులర్గా 24 గంటలు ఆస్పత్రిలో ఉండాలని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కే మల్లయ్య మండల కన్వీనర్ మేలి గిరి ఈరన్న నాయకులు డిమాండ్ చేశారు. ప్రతి నిత్యము పి హెచ్ కి చాలా మంది అవుట్ పేషెంట్లు గర్భవతులు రోజు ఉదయం 8 గంటల నుంచి హాస్పటల్ దగ్గర పడిగాపులు కాస్తున్నారని డాక్టర్లు ప్రతిరోజు ఆదోని నుంచి 10, పదిన్నర గంటలకు హాస్పిటల్ కి వచ్చి తిరిగి సాయంత్రం మూడు గంటలు తిరిగి ప్రయాణం ఆదోని కి వెళ్ళిపోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్లు పేషెంట్లను సరిగా దగ్గరికి తీసుకుని చూడకుండా డాక్టర్లు రూములో కూర్చుని పేషెంట్లను కిటికీలో నుంచి అడిగి మందులు రాసి పంపుతున్నారు. పేషెంట్ తన బాధను చెప్పుకోలేక లోపలే కుల్లి బాధపడుతున్నాడు అన్నారు. డాక్టర్లు మూడు గంటలకు వెళ్లిపోయిన తర్వాత అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా ఆసుపత్రికి వస్తే అక్కడ ఉన్న ఏఎన్ఎంలు అటెండర్ లో డాక్టర్ గా మారి చికిత్స అందిస్తున్నారు అని ఆయన అన్నారు. కావున డాక్టర్లు కౌతాళం లోనే కాపురం ఉండేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసినారు.
డాక్టర్లు ఇంటికి వెళ్లి పోయిన తర్వాత అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఆస్పత్రిలో ఉన్న మందులు ఇతర బాటిల్స్ గ్రామాల్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ లకు సప్లై చేస్తున్నారు అని, ఈ విషయము డాక్టర్ కు చాలాసార్లు తెలిపిన ప్రయోజనం లేదు అన్నారు. ఆసుపత్రి నందు ఖాళీగా ఉన్నటువంటి ఈ పోస్టులను భర్తీ చేసి డాక్టర్లు కౌతాళం నందు నివాసం ఉండి పేషెంట్లు చూసేటట్లు పై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ గా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఉలిగయ్య, వెంకటేష్, వీరేష్ సత్య తదితరులు పాల్గొన్నారు.
Comments