బాలిక పాఠశాలలో టీచర్ ఓవర్ యాక్షన్...
ఆ తరువాత...
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
ఉపాధ్యాయులను ఎదిరించి మాట్లాడుతున్న విద్యార్థిని ఉపాధ్యాయురాలు మందలించడంతో విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయురాలితో గొడవపడ్డారు. మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు పాఠశాలలోనే కొట్టుకునే వరకు వెళ్లడంతో చివరకు మండల విద్యాశాఖ అధికారి రంగంలోకి దిగాల్సి వచ్చింది. ప్రొద్దుటూరులోని ఎద్దుల సుబ్బమ్మ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉపాధ్యాయులకు ఎదిరించి మాట్లాడుతున్నదని సునంద అనే ఉపాధ్యాయురాలు సదరు విద్యార్థిని మందలించారు.
అయితే తమ కుమార్తెను కావాలనే సదరు ఉపాధ్యాయురాలు ఇబ్బంది పెడుతుందంటూ హెడ్మాస్టర్ వద్దకు వచ్చి విద్యార్థిని తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో హెడ్మాస్టరు సదరు ఉపాధ్యాయురాలని పిలిపించి మాట్లాడుతుండగా, విద్యార్థిని తల్లి ఉపాధ్యాయురాలు ఒకరినొకరు దూషించుకుని చివరకు కొట్టుకున్నారు. సమస్య పెద్దదవడంతో మండల విద్యాశాఖ అధికారి సావిత్రమ్మ పాఠశాలకు చేరుకుని జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు.
U don't know what happened their
We are school students from yvs mgh school
Their is no fault on teacher
It's student and her mother have bad character
We want our teachers
We want our sunanda back to our school
If don't we students don't go classs