భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్న లైన్ మెన్
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
అతనో బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగి, పది మందికి మంచి చెడు చెప్పవలసిన బాధ్యత తనపై ఉంటూ, యువతను సన్మార్గంలో నడిపిస్తూ వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాల పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత గల పౌరుడు. అయితేనేం... హౌసింగ్ బోర్డ్ సచివాలయం - 3 నందు లైన్ మెన్ గా ప్రభుత్వ ఉద్యోగం వెలగ పెడుతున్న సరితాల పెద్దబాబు కు వేంపల్లి మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన అనితతో లాక్ డౌన్ సమయం లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు జన్మించారు.
అత్తమామలకు తన తల్లిదండ్రుల గురించి అబద్ధాలు చెప్పి లాక్ డౌన్ సమయంలో నిర్ణీత గడువు లోగా హడావుడిగా వారం లోపే పెళ్లి చేసుకున్న పెద్ద బాబుకు భార్యపై పెద్ద మనసు లేకుండా పోయింది.. అప్పటికే ప్రొద్దుటూరు లోని ఒక మహిళతో, జమ్మలమడుగులోని మరొక మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న పెద్ద బాబు, అనిత ను పెళ్లి చేసుకున్న ఐదు నెలల నుండి వేధింపులకు గురి చేయటం ప్రారంభించాడు. ఒకానొక సందర్భంలో హత్య ప్రయత్నం కూడా చేసినట్లు అనిత వాపోతోంది. అత్త, మామ, ఆడబిడ్డ తనను చిత్రహింసలకు గురిచేసి చంపే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ, ప్రతిరోజు మద్యం సేవించి తనను మానసిక వేదనకు గురి చేయడమే కాకుండా చిత్రహింసలకు గురి చేసేవాడని తనకు తగిలిన రక్త గాయాలను పాత్రికేయులకు చూపిస్తూ కన్నీటి పర్యంతమయింది.
తనను తన బిడ్డను చంపేస్తానంటూ బెదిరిస్తూ, వీడియో కాల్ చేసి అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళలకు చూపించేవాడని, ఈ విషయమై పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ, పోలీసులకు ఫిర్యాదు చేసినా తగు న్యాయం జరగలేదని అనిత అంటోంది. తనను చంపి తన బిడ్డలను తన అక్కకు అప్పగిస్తానంటూ పెద్దబాబు బెదిరించేవాడని సంసారం సజావుగా సాగించాలని హితువు పలికిన తన తండ్రిపై కక్ష కట్టి ఏడు మంది వ్యక్తులతో పెద్ద బాబు దాడి చేయించారని, తనను, తన తండ్రిని, తల్లిని, తమ్ముడిని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని అనిత వాపోతోంది. తాజాగా తనపై మరోమారు తన భర్త దాడి చేసిన నేపథ్యంలో ఐదో నెల గర్భంతో ఉన్న తనకు కడుపులోని బిడ్డ ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడం వలన డీఎన్సీ అబార్షన్ చేయవలసి వస్తోందని అనిత కన్నీటి పర్యంతమై తన చంటి బిడ్డ తల్లిదండ్రులతో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. ఇప్పటికైనా మహిళా సంఘాలు తనకు తగిన న్యాయం చేయాలని దీనంగా వేడుకుంటోంది అనిత.
For Video click here : https://youtu.be/R4-0TqjLlMY?si=TLn-jmnG_j9TvX8v
Comments