జిల్లా ప్రభుత్వాసుపత్రిలో నిరసన దీక్ష
ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రొద్దుటూరులో నిరసన దీక్ష చేపట్టిన కడప జిల్లా గౌరవ సలహాదారుడు నాయకుడు పసుపులేటి శివకృష్ణ, ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జీవో నెంబర్ 549 ప్రకారం, ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ కాంట్రాక్టు కార్మికులకు 16,000 వేతనం అందడం లేదని, ఈ.ఎస్.ఐ కార్డులు ఇవ్వకపోవడంతో పాటు ఉద్యోగుల ఖాతాల్లో ఈపీఎఫ్ సక్రమంగా జమ చేయకుండా ఏజెన్సీ కాంట్రాక్టర్లు శానిటేషన్ వర్కర్ల కడుపు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎపివివిపి జిల్లా అధికారి డి.సి.హెచ్.ఎస్, మెడికల్ సూపరింటెండెంట్ దృష్టికి పలుమార్లు సమస్యలు విన్నవించిన ఎటువంటి ఫలితం లేదని, అందుకు పరిష్కార మార్గంలో భాగంగా ఆసుపత్రి ప్రాంగణంలో మదర్ తెరిసా విగ్రహం దగ్గర ఆందోళన చేపట్టిన కార్మికులు. అప్పుడే కడప నుంచి విచ్చేసిన డిసిహెచ్ఎస్ ఉద్యోగులతో యూనియన్ సంఘ నాయకులతో మాట్లాడుతూ ఉద్యోగ గుర్తింపు కార్డులతో పాటు ఈఎస్ఐ కార్డులు ఇస్తామని, పీఎఫ్ కట్టడంలో అన్యాయం జరిగి ఉంటే ఏజెన్సీ పై చర్యలకు ఆదేశిస్తామని, అంతేకాకుండా మిగిలిన అన్ని సమస్యలు కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇవ్వగా అందుకు సమ్మతించిన ఉద్యోగులు, సంఘం నాయకులు దీక్షను విర్మానించారు. గతంలో మాదిరిగానే కాలయాపన జరిగితే మరోమారు మోసపోవడానికి సిద్ధంగా లేమని, తిరిగి ఉద్యమ బాట పడతామన్నారు. ఈ కార్యక్రమంలో డి సి హెచ్ ఎస్ తోపాటు మెడికల్ సూపర్డెంట్ కూడా ఉన్నారు.
Comentários