వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తీరు తెన్నూ పై ఇప్పటికే ఎన్నో విమర్శలు వస్తున్న, వీరి పద్ధతుల్లో మార్పు రావటం లేదు, ప్రాధమిక హక్కులయిన విద్యా, వైద్యం పై ప్రభుత్వాలు నిధులు వెచ్చిస్తున్నా, అవి సామాన్య ప్రజలకు అందటం లేదనే చెప్పాలి, ప్రత్యేకించి ప్రభుత్వ ఆసుపత్రులలో పేషెంట్లపై నిర్లక్ష ధోరణి ప్రదర్శించటం పరిపాటిగా మారింది. ఓ నిండు గర్భిణీపై నిర్లక్ష సంఘటనే నేడు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగు చూసింది, వివరాల్లోకి వెళితే రాజుపాళెం గ్రామానికి చెందిన మౌలాలి భార్య శివ కుమారి (27) తన రెండవ కాన్పు కొరకు నేటి ఉదయం 3:30 నిమిషాలకు పురిటి నొప్పులు ఎక్కువ అకావటం చేత ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. ఆ సమయంలో ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్లు లేరని, డ్యూటీలో ఉన్న నర్సు చెప్పగా, కాన్పు కష్టం (కంప్లికేటెడ్) అవుతుంది కడప రిమ్స్ కు తరలించమని సూచించారు. సాధారణ కాన్పు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని శివ కుమారి బంధువులు ఒకానొక దశలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని వేడుకున్న పరిస్థితి. భయాందోళనకు గురయిన భర్త మౌలాలి 5:30 గంటలకు 108 వాహన సిబ్బందితో హుటాహుటిన గర్భవతి శివ కుమారిని అంబులెన్సు లో రిమ్స్ కి తరలించే ఏర్పాట్లు చేశారు, మార్గమధ్యంలోని మొర్రాయిపల్లె వద్ద శివకుమారి 6:07 నిమిషాలకు సుఖ ప్రసవం అయ్యి పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శివ కుమారికి డ్రెస్సింగ్, స్టిచెస్ వేయించిన 108 సిబ్బంది, తిరిగి ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి శివ కుమారిని తరలించారు. ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన తరువాత బాలింత శివ కుమారి బంధువులు ఆసుపత్రి సిబ్బందిని నిలదీసినట్లు సమాచారం.
ప్రభుత్వ ఆసుపత్రులలో పురుడు పోసుకోవలసిన ఎందరో తల్లులు ఇలా ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం నిర్లక్ష్యం వలన 108లలో కాన్పులు అవుతన్న సంఘటనలు కోకొల్లలు. ఇకనైనా ఇక్కడి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం వీడి తమకిచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలరని ఆశిస్తున్నారు ప్రజలు. కాగా భావోద్వేగానికి లోనయిన భర్త మౌలాలి 108 వాహనం సిబ్బంది పైలట్ గురు మోహన్ రెడ్డి కి, EMT (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) గా పని చేస్తున్న జి. లక్ష్మి నరసమ్మకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
Comentários