న్యాక్ గుర్తింపు పొందిన గౌతమి మహిళా ఇంజనీరింగ్ కళాశాల
ప్రొద్దుటూరు, నవంబర్ 16
ప్రొద్దుటూరు మండల పరిధిలోని గౌతమి మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు న్యాక్ గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రామఘుబ్బమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 4 మరియు 5 తేదీలలో న్యాక్ బృందం కళాశాలను పరిశీలించిందన్నారు. న్యాక్ బృందంలో దీన్ బందు ఛోటు రామ్ విశ్వవిదానాలయం నుండి ప్రొఫెసర్ మనోజ్ దుహాన్, ఒరిస్సాలోని ఎమ్మెస్ సిబి విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ హిమబిందు మరియు తెలంగాణలోని తీగల క్రిష్ణారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నుండి ప్రొఫెసర్ వెంకట మురశీ మోహన్ లు ఉన్నారన్నారు. ఈ బృందం రోజుల పాటు కళాశాలలోని వివిధ విభాగాలు, బోధనాపద్దతులు, పరిశోధనా అంశాలు, సేవా కార్యక్రమాలు, ప్రయోగశాలలు తదితర
అంశాలను పరిశిలించి కళాశాలకు న్యాక్" బి++" గ్రేడును నిర్ణయించారని ఆమె తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా బృంద సభ్యులు కళాశాలలోనివిద్యార్థినిలు, తల్లి దండ్రులు, పూర్వపు విద్యార్థినిలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారన్నారు. కళాశాలకు ఈ గుర్తింపు రావడానికి కృషిచేసిన ప్రిన్సిపాల్ అధ్యాపక మరియు ఇతర సిబ్బందిని ఇందుకు కృషి చేసిన ప్రిన్సిపాల్స్ అధ్యాపక మరియు ఇతర సిబ్బందని కళాశాల యాజమాన్యం అభినందించారు. ఈ కార్యక్రమానికి కళాశాల కరస్పాండెంట్ బాబమ్మ , డైరెక్టర్లు నాగూరు, రవీంద్రారెడ్డి, కో డైరెక్టర్ శైలూష, వివిధ విభాగ అధిపతులు ప్రకాష్ రావు, జాబీర్, యకూబ్ అలి, విజయమ్మ, అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం పాల్లాన్నారు.
Comentarios