అమరావతి, ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, తాజాగా గ్రామా వాలంటీర్ వార్డ్ సచివాలయ సిబ్బంది తమకు ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాలి అంటూ ఒక్కరోజు ఆందోళన బాట పట్టిన విషయం పాఠకులకు తెలిసినదే అయితే దానికి తగ్గ ప్రతిఫలం లభించిందనే చెప్పాలి, అయితే అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు 10665 మంది సచివాలయ ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారని, వీరందరూ విధులకు హాజరు కాకుండా నిరసనలో పాల్గొన్న నేపథ్యంలో వీరందరి జాతభత్యాలలో ఒక్క రోజు జీతాన్ని మినహాయించాలని DDO లను మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు, అట్లు మినహాయించని యెడల లేదా విరుద్ధంగా వ్యవహరించి జీత భత్యాలు విడుదల చేసినచో DDO లపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇది ఇలా ఉండగా శాంతియుతంగా తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టిన తమకు జీత బత్యాలలో కోతలు విధించడంపై సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.
Comentários