పారిశుద్ధ్య పనులు వేగవంతం.
చిట్వేలు గ్రామసభ లో ఉమామహేశ్వర్ రెడ్డి.
ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా పారిశుద్ధ్య పనులను వేగవంతం చేస్తున్నట్లు చిట్వేలి గ్రామ ఉపసర్పంచ్ చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో గ్రామ సర్పంచ్ దండు లక్ష్మి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు.
రోజువారి చేపట్టే పారిశుద్ధ్యం,త్రాగునీరు, వీధి దీపాల నిర్వహణ కార్యక్రమాలతో పాటూ గ్రామంలో సీజనల్ వ్యాధులు,దోమలు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులకు పెద్దపీట వేస్తున్నట్లు ఉమామహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆరోగ్య సిబ్బంది ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నట్లు తాను తెలిపారు. పర్యావరణ పరిరక్షణ లో భాగంగా చెత్తను ఇస్టాను రీతిలో పడవేయకుండా చెత్త సేకరణ వారికి ఇవ్వడం లో, జీవోఎంఎస్ నంబర్ 12 పూర్తిగా అమలు జరిపి గ్రామాభివృద్ధికి పంచాయతీ ప్రజలు సహకరించాలని ఉమామహేశ్వర్ రెడ్డి కోరారు. గ్రామంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులను గూర్చి గ్రామసభలో చర్చించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామ సుబ్బారెడ్డి,పంచాయతీ వార్డు మెంబర్లు, సచివాలయ, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Comments