పంచాయతీ పరిధిలో గ్రామ సభ
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లె పంచాయతీ కార్యాలయంలో ఆదివారం ఉదయం గ్రామా సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తపల్లె పంచాయతీ సెక్రటరీ నరసింహులు అధ్యక్షత వహించగా సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి పాల్గొన్నారు, ఈ సందర్భంగా ముందుగా జాతిపిత మాహాత్మా గాంధీ 153వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం సెక్రటరి నరసింహులు మాట్లాడుతూ గాంధీజీ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని, గ్రామీణాభివృద్ధి దిశగా గాంధీజీ అడుగులు వేశారని కొనియాడారు. సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ స్ఫూర్తి ప్రదాత గాంధీజీ అని, బ్రిటిష్ పాలనలో వారి కబంధ హస్తాల నుండి జాతికి విముక్తి కలిగించిన జాతిపిత మాహాత్మా గాంధీ అహింసా మార్గంలో నడచారని, గ్రామ స్వరాజ్యం నినాదంతో రాజ్యాంగంలో సర్పంచులకు పెద్దపీట వేశారని, గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని స్థాపించాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం నేటితో గ్రామ వార్డు సచివాలయ వాలంటరీ వ్యవస్థ అమలులోకి వచ్చి మూడు సంవత్సరాలు గడచినదని, ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తెచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనతనేనని, దాదాపు లక్షా ఇరవై వేల మంది సచివాలయ సిబ్బంది వార్డు వాలంటీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించగా, పరిపాలన నేడు గ్రామా స్థాయికి తెచ్చి ప్రజల మన్ననలు పొందుతున్నామని, అందుకుగాను ముందుగా సచివాలయ సిబ్బందిని వాలంటీర్లను అభినందించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, వార్డు వాలంటీర్లు, పంచాయతి కార్యాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
Commenti