కర్నూలు జిల్లా, కౌతాళం మండల కేంద్రంలో గ్రామ సేవకుల నిరాహార దీక్షలు నాలుగోరోజు తాసిల్దార్ కార్యాలయం ఆవరణ ముందు కొనసాగుతున్నాయి. ఈ నిరాహార దీక్షకు సిఐటియు జిల్లా అధ్యక్షులు పి ఎస్ రాధాకృష్ణ సందర్శించి దీక్షలో కూర్చున్న వారికి పూలమాలలు వేసి గ్రామ సేవకులను రాష్ట్ర ప్రభుత్వము సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సేవకులు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆందోళన కు పిలుపునివ్వడం అయినది. ఈ నెల 8వ తారీఖు నుంచి 22 వరకు మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు, మార్చి 1,2 ,3 తేదీలలో జిల్లా జిల్లా కార్యాలయం ముందు,7 8 9 10 తేదీలలో విజయవాడ లో నిరసన కార్యక్రమాలు తెలియజేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చే రీతిలో అందరూ ఐక్యంగా పోరాటం లో పాల్గొనాలని ఆయన పిలుపునివ్వడం అయినది.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ మల్లయ్య , మండల కార్యదర్శి మేలి గిరి ఈరన్న, ఉలిగయ్య, వెంకటేష్, వీరేష్, గ్రామ సేవకుల సంఘం నాయకులు ప్రహల్లాద, బస్సన్న, అంపయ్య, హనుమంతు, నర్సింలు, వీరేష్, గోపాల్, భీమక్క, అయ్యమ్మ, సావిత్రమ్మ, హనుమంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments