వాలంటీర్లను సత్కరించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
వాలంటీర్ల వ్యవస్థతో విప్లవాత్మక మార్పులు - ఎమ్మెల్యే రాచమల్లు
ప్రొద్దుటూరు పట్టణంలో శనివారం నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లకు ప్రభుత్వం ప్రకటించిన సేవా పురస్కారాలను శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రధానం చేశారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థతో ప్రజల ఇళ్ల ముంగిటకే పాలన చేరువ అయిందన్నారు. జగనన్న సంక్షేమ పథకాలకు సాధకులు వాలంటీర్లేనని, క్షేత్రస్థాయిలో వాలంటీర్లు అందిస్తున్న సేవలు అజరామరం అని తెలిపారు. కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి వాలంటీర్లు సేవలందించారని గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరారు. గత తెలుగుదేశం ప్రభుత్వానికి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తేడాను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు హయాంలో సంక్షేమ పథకాల ఎంపికకు జన్మభూమి కమిటీ లను ఏర్పాటుచేసి ప్రజలను పీడించారని దుయ్యబట్టారు. వాలంటీర్లపై ప్రభుత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. వాలంటీర్లు అందిస్తున్న సేవలను గుర్తించి వైయస్ జగన్ ప్రభుత్వం వారిని సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్రా ల పేరుతో పురస్కారాలు అందజేసి వారిని గౌరవిస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్, పలువురు వైసిపి నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Comentarios