పుట్టిన ఊరు ఋణం తిర్చుకుంటున్న
ఉక్కలం సురేష్.
---బడి మరియు గుడి కోసం సాయం.
--ఆపదలో ఉన్నవారికి నేను సైతం అన్న భరోసా.
తమ పిల్లలకే కాదు వారి పిల్లలకు కూడా ఆస్తులు కూడ బెడుతూ అనునిత్యం సంపాదన తపనతో ముందుకెళ్తున్న ఈ రోజుల్లో... తమకు ఉన్న దానిలో తనమండల పరిధిలోని ప్రజల సమస్యలను గుర్తించి ఆపదలో ఉన్న వారికి తమ తోడ్పాటునందిస్తూ.. నలుగురికి ఆదర్శంగా నిలుస్తూ.. కన్న ఊరి రుణం తీర్చుకుంటున్న ఉక్కలం సురేష్ దంపతుల గురించి మనము తెలుసుకుందాం...
అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం , కెయస్ అగ్రహారం వాసి ఉక్కలం సురేష్ తమ తల్లి దండ్రులు కీర్తి శేషులు శ్రీమాన్ ఉక్కలం వెంకట శేషాచార్యులు మరియు సరోజమ్మల జ్ఞాపకర్ధంగా , అగ్రహారం వెంకటేశ్వర స్వామి గుడి కొరకు రధం మరియు విగ్రహాల జీర్ణోద్ధరణ కై 5 లక్షల రూ.లు దానం చేశారు. ఈ సందర్భంగా ఆ దంపతులు ఇరువురు మాట్లాడుతూ సుమారు 150 సంవత్సరాల క్రితం తమ పూర్వీకులు నిర్మించిన శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తమ వంతు సాయం అందించడం ఈ జన్మ అదృష్టమని వారన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకున్నారు.
పాఠశాల నిర్మాణ దాత: కాగా మండల పరిధిలో 2019 సం.లో గిరిజన వాసుల పిల్లలకు పాఠశాల లేదు ఆర్ధిక సాయం చేద్దాం అని తన బాల్యమిత్రుడు 'చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ కార్యదర్శి గాడి.ఇంతియాజ్ తెలిపిన వెంటనే 'విద్యాదానం మహాదానం' అని భావించి భవన నిర్మాణ ఖర్చు తానే భరిస్తాన్నని 3,40,000 రూ.లు ఖర్చుతో తమ తల్లి దండ్రుల జ్ఞాపకంగా " చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీసంస్థ" పర్యవేక్షణతో పక్కా భవనం నిర్మించారు.
చిట్వేల్ కి విచ్చేసిన వారు సదరు గ్రామానికి వెళ్లి పిల్లలతో,గ్రామ ప్రజలతో మమేకమై వారి విద్యా బోధన,అక్కడ ఉన్న వసతుల గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు పిల్లలకి మిఠాయిలు పంచి పెట్టారు.
క్రీడా సామాగ్రి వితరణ: అలాగే తాను విద్యనభ్యసిన చిట్వేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 62,000 రూ.ల వ్యయంతో క్రీడాసామగ్రి మరియు దుస్తులు వితరణ చేసారు, ఇలా ఎప్పటికప్పుడు అవసరం తెలిసిన ఆపదలో ఉన్నవారికి మరియు సమాజ సేవకొరకు సానూకులంగా స్పందించి మానవత్వం చాటుకుంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న ధర్మదాతలు ఉక్కలం సురేష్ మరియు శ్రీమతి భారతి దంపతులు ఇద్దరికీ గ్రామప్రజలు మరియు చిట్వేల్ హెల్ప్ లైన్ సంస్థ సభ్యులు అభినందనలు తెలియచేసారు. వారు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిద్దాం.
Comments