ప్రైవేట్ ట్రావెల్స్ కార్యాలయాలలో జీఎస్టీ అధికారుల సోదాలు
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రైవేట్ ట్రావెల్స్ కార్యాలయాలపై ఈరోజు ఉదయం నుంచి జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల, ఇతర రాష్ట్రాల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ లో వచ్చిన పార్సిల్స్ ను అధికారులు పరిశీలించారు. సరైన బిల్లులు ఉన్నాయా, లేదా అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. రాబోవు ఎన్నికల నేపథ్యంలో నగదు రవాణా జరుగుతుందా అనే కోణంలో కూడా జిఎస్టి అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
Comments