నేడే బాధ్యతల స్వీకరణ
2007 స్టేట్ గ్రూప్వ్1 టాపర్ గా నిలిచిన మట్లి వేణుగోపాల్ రెడ్డిని గుంటూరు కలెక్టర్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
కొత్త జిల్లాల ఏర్పాట్ల నేపేద్యంలో మట్లి వేణుగోపాల్ రెడ్డి పదోన్నతిపై గుంటూరు జిల్లా కలెక్టర్ గా 4 వ తేదీ సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు.
కడప జిల్లాకు చెందిన ఈయన గుంటూరు కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టనుండటంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు
పేద రైతు కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన మట్లి వేణుగోపాల్ రెడ్డి కడపజిల్లా బద్వేలు నియోజకవర్గం జాఫర్ సాహెబ్ పల్లిలో మట్లి చిన్న కృష్ణారెడ్డి,చెన్నమ్మ దంపతులకు జన్మించాడు.
పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈయన తన చదువు అంతా ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే అభ్యసించి స్టేట్ లో గ్రూప్ 1 టాపర్ గా నిలిచారు.
ప్రాథమిక విద్య నుంచి మాధ్యమిక విద్యవరకు అట్లూరు మండలం జడ్పీ హైస్కూల్లో ఎనిమిది నుంచి పదవ తరగతి వరకు బద్వేలు జడ్పీ హైస్కూల్లో చదివారు. ఇంటర్మిడియట్ బద్వేలు వీరారెడ్డి కాలేజీలో డిగ్రీ కడప గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో పూర్తి చేసి గ్రూప్ 1 టాపర్ గా నిలచి మొదటగా నెల్లూరు ఆర్డీఓ గా పనిచేశారు అటునుంచి రాజమండ్రి ఆర్డీఓ గా,చిత్తూరు సీఈఓ గా బాధ్యతలు నిర్వర్తించి పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్గా,విశాఖపట్నం పట్నం జాయింట్ కలెక్టర్ గా పని చేస్తూ పదోన్నతి పై గుంటూరు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు
మట్లి వేణుగోపాల్ రెడ్డి చదువు మొత్తం సర్కార్ బడుల్లో తెలుగుమాధ్యమంలో జరిగి స్ఫూర్తిగా నిలిచారు
పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పోలవరం ప్రాజెక్ట్ పనులు,భూసేకరణ వేగవంతం చేసి ప్రభుత్వ ప్రశంసలు పొందారు ఉత్తమ ఆర్డీఓ గా ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా అవార్డు పొందారు.
Σχόλια