దేవపట్ల బాలికల గురుకుల పాఠశాలలో పెండింగ్ లో ఉన్న అదనపు గదుల నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపించాలి. అసంపూర్తిగా ఉన్న భవనాలను వెంటనే పూర్తి చేసి వాడుకలోకి తీసుకురావాలి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు తుమ్మల లవకుమార్.
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న దేవపట్ల అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో పెండింగ్లో ఉన్న అదనపు గదుల నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్)రాష్ట్ర సమితి సభ్యులు తుమ్మల లవకుమార్ అన్నారు.సోమవారం ఆయన ఏఐఎస్ఎఫ్ ఏరియా నాయకులతో కలిసి అసంపూర్తిగా ఉన్న గురుకుల పాఠశాల భవనాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు దాదాపు వందల మంది విద్యార్థులు చాలీచాలని ఇరుకు ఇరుకు గదులలో విద్యను అభ్యసించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని,దీనికి కారణం దాదాపు10 సంవత్సరాల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో విద్యార్థుల అవస్థలను దృష్టిలో పెట్టుకొని అదనపు గదుల కోసం దాదాపు 50.40 లక్షల రూపాయల నిధులను కేటాయించడం జరిగిందన్నారు.
Comments