ఈ రోజు ఉదయం గుంటూరు జిల్లా సెబ్ జయింట్ డైరెక్టర్ బిందు మాధవ్ IPS ఆదేశాల మేరకు గుంటూరు అర్బన్ సేబ్ ఇన్స్పెక్టర్ టి నారాయణ స్వామి మరియు సిబ్బంది పోతురాజు, రవీంద్ర రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,నాగరాజు,రాజేష్ లు కలిసి పక్కా సమాచారంతో నల్లచెరువు లారీ స్టాండ్ వద్ద
సుమారు 55 నుంచి 60 వేల వరకు గుట్కా పాకెట్స్ ను, గుట్కా పాకెట్స్ వున్న మారుతి కార్ ను స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ నారాయణస్వామి మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన మరియు నిషేధిత గుట్కా, పాన్ పరాక్, గంజాయి, తెలంగాణ అక్రమ మద్యం లాంటి నిషేధిత వాటిని అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అదేవిధంగా గా అలాంటివి అమ్మేవారి వివరాలు తెలిపి ప్రజలు కూడా మాకు సహకరించాలని మాకు సహకరించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సమాజానికి మేలు చేసే విధంగా ప్రయత్నిస్తున్న మా పోలిస్ వ్యవస్థకి ప్రజలు కూడా సహకరించాలని సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునే తీరుతామని అలాంటి వాటిల్లో ఎవరికి లోబడబోమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
Comments