2024లో నేనే ఎమ్మెల్యే - ప్రవీణ్
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 16
శుక్రవారం సాయంత్రం జిల్లా, నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు వేలాదిగా తరలిరాగా, ఆ పార్టీ కడప పార్లమెంట్, ప్రొద్దుటూరు నియోజకవర్గ స్థానాల టిక్కెట్లు ప్రకటించబడ్డ రెడ్డెప్పగారి శ్రీనివాసుల రెడ్డి, జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి లకు, నాయకులు, కార్ర్యకర్తలు, అభిమానులు సాదర స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ, బాణాసంచా పేలుస్తూ శ్రీనివాసుల రెడ్డి, ప్రవీణ్ రెడ్డి లకు గజమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియచేసారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి సాగిన ర్యాలీ టీడీపీ కార్యాలయం వరకు సాగింది. ప్రజలకు నాయకులు అభివాదం చేస్తూ సాగిన ఈ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు స్వచ్చంధంగా ప్రజలు కూడా ఈ ర్యాలీలో పాల్గొని ప్రవీణ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియచేసారు.
ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ, గత మూడునర్ర సంవర్సరాలుగా వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకుల వైకరి మొత్తం టీడీపీ నాయకులపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయటమే లక్ష్యంగా సాగిందని, నేటికీ ప్రవీన్ మీద ఎనిమిది కేసులు బనాయించారని, వైసీపీ కి కేసులు పెట్టటం పరిపాటిగా మారిందని, ఎస్పీ ఎస్టీ కేసు ప్రవీణ్ పై నమోదు చేయటం సబబు కాదని, ప్రవీణ్ కు సంఘీభావం తెలుపుతూ టీడీపీ నాయకులు అందరూ అండగా నిలిచామన్నారు. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని చూసారని, పట్టణంలో అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ గా జరుగుతున్నట్లు, ఇది ప్రభుత్వ స్థానిక నాయకుల వైఫల్యంగా ఆయన అభిప్రాయపడ్డారు. కాగా నియోజకవర్గ ఇంచార్జీలే ఎన్నికల్లో పోటీ చేస్తారని, సరయిన సమయంలో పార్టీ బి.ఫారం ఇచ్చి పోటీకి నిలుపుతుందని, ఇందులో ఏ మాత్రం సందేహం వలదని, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడయినా తమ పార్టీలో నియోజకవర్గ ఇంచార్జే అభ్యర్ధని ఆయన తెలిపారు.
అనంతరం ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తరువాత, చంద్రబాబు తనను ప్రతి ఇంటికి తిరిగి సభ్యత్వాలు నమోదు చేయమన్నారని, బాదుడే బాదుడు కార్యక్రమంతో ముందుకు వెళ్లి ప్రజలపై మోపిన భారాన్ని ప్రజలకు వివరించమన్నారని, నియోజకవర్గ నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, బూత్ లెవెల్ స్థాయి నుండి బలోపేతం దిశగా అడుగులు వేయనున్నామని, తాను ఉద్యమాలు చేసి రాజకీయాలలోకి వచ్చిన వ్యక్తినని, భయం ఎరుగని నాయకుడినని వెల్లడించారు.
గత రెండు సంవస్త్సరాలుగా టీడీపీ పార్టీ కార్యక్రమాలలో దాదాపు యనభై అయిదు శాతం పాల్గొని, కడప జిల్లాలో మొదటి టీడీపీ నాయకునిగా గుర్తించారని, ఎంపీ అభ్యర్థి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇకపై ముందుకు వెళ్తామని, 2024లో జరగబోవు అసెంబ్లీ ఎన్నికలలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ని మాజీ ఎమ్మెల్యే గా మారుస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ సిద్ధాంతాలతో నడుచుకున్న నాయకునిగా తాను ఇకపై పార్టీ కోసం ఒక సైనికునిగా పనిచేస్తానని, కార్యకర్తలే తన బలంగా పేర్కొన్నారు. తనపై నమోదైన ఎస్పీ ఎస్టీ కేసు పూర్తిగా బూటకమని, అక్రమ కేసులు తనపై బనాయించి ఇబ్బందులకు గురి చేశారని. నియోజకవర్గ ప్రజల పక్షాన చంద్రబాబు తనను నిలబడమన్నాడని, టీడీపీ గెలిచెంత వరకు విశ్రాంతి లేకుండా పని చేస్తాం అని ఆయన తెలిపారు.
Comments