వార్డు ఉప ఎన్నికలు మార్పుకు సంకేతం
- జీవి ప్రవీణ్
కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం 9వ వార్డు, కొత్తపల్లి 13వ వార్డు పంచాయతీల ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే రాచమల్లు పై ప్రజలు నమ్మకం కోల్పోయారని, కొత్తపల్లి 13వ వార్డు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి బంగారు గొలుసు, కాలి పట్టీలు, అయిదు వేల రూపాయల డబ్బు, ఒక చీర ఇచ్చినా ఎమ్మెల్యే బలపరచిన అభర్ధిని అక్కడి ఓటర్లు ఓటమిపాలు చేశారన్నారు. ఇందుకుగాను కొత్తపల్లి పంచాయతీ 13వ ప్రజలకు ప్రవీణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఒక వార్డు మెంబర్ ను గెలిపించుకోవటానికి మూడు కోట్లు కర్చు చేయటం ఏమిటని ప్రశ్నించారు? వైసీపీ లో వర్గ విభేదాలే పోటీకి కారణం అని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు 13వ వార్డులో ప్రచారం చేయలేదని, ఇదే తీర్పు 2024లో పునరావృతం అవుతుందని జోస్యం చెప్పారు.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అహంకారానికి కొత్తపల్లి పంచాయతీ 13వ వార్డ్ ప్రజలు బుద్ధి చెప్పారని ప్రొద్దుటూరు టిడిపి నాయకులు ఈవి సుధాకర్ రెడ్డి అన్నారు. టీడీపీ జెండా ప్రొద్దుటూరులో ఎగరనివ్వను ఆన్న ఎమ్మెల్యే ఇప్పుడు ఏమి మాట్లాడతారన్నారు, రాబోవు ఎన్నికల్లో ప్రొద్దుటూరులో టీడీపీ జెండా ఎగురవేసి టిడిపి సత్త చాటుతామని, టిడిపి ప్రొద్దుటూరు అభ్యర్థి జీ వి ప్రవీణ్ కుమార్ రెడ్డే అని జోస్యం చెప్పారు. ఎమ్మెల్యే బలపరచిన అభ్యర్థిని వైసీపీ నాయకులే ఓటమిపాలు చేశారని ఆరోపణలు గుప్పించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్ల, బీసీ నాయకుడు చిట్టే మధు, నాయకులు పాల్గొన్నారు.
Comentarios