గాజువాక ప్రసన ఆంద్ర ప్రతినిధి, జీవీఎంసీ 85 వార్డు కొండయ్య వలస గ్రామంలో స్వచ్ఛ సర్వేక్షన్ 2022 సందర్భంగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పురస్కరించుకొని సచివాలయ సిబ్బంది అంబేద్కర్ విగ్రహమును పరిశుభ్రం చేసి దానిముందు ముగ్గులు వేసి ఎంతో ఆకర్షణీయంగా అలంకరణ చేశారు. 85 వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి ఇల్లపు వరలక్ష్మి, గాజువాక జోనల్ కమిషనర్ డి శ్రీధర్, 6వ జోన్ ఏ ఎమ్ హెచ్ ఓ డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్, అగనంపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం కృష్ణారావులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
డి శ్రీధర్ మాట్లాడుతూ 2021 సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షన్ లో 9వ స్థానం వచ్చిందని 2022 లో జిహెచ్ఎంసి సిబ్బంది స్వచ్ఛంద సంస్థలు అందరూ భాగస్వామి విశాఖ నగరాన్ని మొదటి స్థానం తీసుకురావడానికి కృషి చేయాలని అన్నారు స్వచ్ఛ సర్వేక్షన్ కాన్సెప్ట్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
శ్రీమతి ఇల్లపు వరలక్ష్మి మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం అయ్యి జీవీఎంసీ వారు చెప్పిన నిబంధనలు అమలుపరిచి విశాఖ నగరానికి ఉత్తమ స్థానం సంపాదించుకుందము అన్నారు.
డాక్టర్ ఎన్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ వ్యక్తి, మన ఇల్లు, మన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకున్న నాడే సమాజం బాగుంటుందని ని తడి చెత్త, పొడి చెత్త వేరు వేరుగా ఇవ్వాలని ప్లాస్టిక్ సంచులు వాడరాదని పర్యావరణాన్ని కాపాడవలసిన పని సామాజిక బాధ్యతగా తీసుకోవాలని అన్నారు
స్వచ్ఛభారత్ అవార్డు గ్రహీత ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ సభాధ్యక్షతన జరిగిన సమావేశంలో గాజువాక జోన్ శానిటరీ సూపర్వైజర్ బీవీ రామారావు కొండయ్య వలస సచివాలయం అడ్మిన్ కే కోమలా ప్రజా వేగు పట్టా రామ అప్పారావు వైయస్సార్ సిపి రాష్ట్ర నాయకులు ఇల్లపు ప్రసాదు 85 వ వార్డు వైఎస్ఆర్ సీపీ నాయకులు బలిరెడ్డి శ్రీను విందుల తాతారావు, జనసేన పార్టీ నాయకులు బుదిరెడ్డి అప్పారావు విందుల నూకరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు కత్తి ప్రదీప్ చంద్ వడ్డాది శ్రీనివాసరావు ఈ పీ ఎస్ కన్వీనర్ విందుల వరహాలు అగనంపూడి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ బంధం అప్పలరాజు శానిటరీ పర్యావరణ కార్యదర్శి కె రాంబాబు మలేరియా ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు మరియు 85 వ వార్డు శానిటరీ పర్యావరణ కార్యదర్శులు కొండయ్య వలస సచివాలయ సిబ్బంది గ్రామ పుర ప్రజలు పాల్గొన్నారు.
జనవరి 26 రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ఉత్తమ అధికారి గాజువాక జోన్ మున్సిపల్ కమిషనర్ బి శ్రీధర్ గారు ప్రశంస పొందిన సందర్భంగా, 6వ జోన్ ఏ ఎం హెచ్ ఓ గా నూతనంగా బాధ్యతలు తీసుకొని ఈ ప్రాంతానికి ప్రప్రధమంగా వచ్చిన సందర్భంగా డాక్టర్ కే కిరణ్ కుమార్ ని అగనంపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరెంట్స్ కమిటీ పువ్వల బోకే ఇచ్చి అభినందించడం జరిగింది.
Opmerkingen