అగనంపూడి ప్రసన్న ఆంధ్ర విలేకరి, ప్రజా ఆరోగ్యమే ధ్యేయంగా జీవీఎంసీ మెరుగైన చర్యలు చేపడుతోంది 6వ జోన్ ఏ ఎమ్ ఓ హెచ్ డా ఎస్ కిరణ్ కుమార్
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ 85 వార్డ్ అగనంపూడి సబ్ జోనల్ కార్యాలయంలో గాజువాక జోన్ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ హెల్త్ డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్ కేక్ కటింగ్ చేసి పంపిణీ చేశారు స్వచ్ఛ సర్వేక్షన్ 2022 అభిప్రాయ సేకరణ కరపత్రం లో విడుదల చేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ 7 -4 -1948 సం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఏర్పడిన సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది. ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన , పౌష్టికాహారము వివిధ రకాల వ్యాక్సిన్స్ లు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయ సహకార చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. జీవీఎంసీ ఆధ్వర్యంలో కరోనా వ్యాధి పై సచివాలయం ద్వారా షెడ్యూలు ప్రకారం నగర ప్రజల అందరికీ మొదటి విడత రెండు వ విడత వ్యాక్సిన్స్ వేయడం జరిగింది. ముఖ్యముగా నగర ప్రజల ఆరోగ్యం కొరకు పారిశుద్ధ్య సిబ్బంది పరిసరాల పరిశుభ్రత సీజనల్ జబ్బులు ,దోమల వల్ల మలేరియా ,డెంగ్యూ వ్యాధులు సోకకుండా ఎప్పుడు కప్పుడు తగు చర్యలు చేపడుతున్నామని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ మన విశాఖ నగరం మొదటి స్థానం సాధించడానికి జీవీఎంసీ సిబ్బందితోపాటు నగర ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణలో సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరారు. నగరములో ముందు ముందు కి డస్ట్ బిన్ లు లేకుండా చెత్తను మా పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు సేకరించి డం జరుగుతుంది అన్నారు.
ఎ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ ఈ కార్యక్రమంలో దేశ ప్రముఖ నగరాల్లో విశాఖ నగరం మొదటి స్థానం సాధించడానికి జీవీఎంసీ వారు సాధ్యమైనంత కృషి చేసినప్పటికీ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు జివిఎంసి వారు అమలుపరుస్తున్న తడి చెత్త పొడి చెత్త, ప్లాస్టిక్ వాడకం నిరోధించడం, బహిరంగ మలవిసర్జన చేయకుండా టాయిలెట్లు ఉపయోగించడం, మన పరిసర ప్రాంతాలు పర్యావరణ తో పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన దిగా కోరారు.
గాజువాక జోన్ శానిటరీ సూపర్వైజర్ బీవీ రామారావు సభ దక్షతన జరిగిన కార్యక్రమంలో 85 వ వార్డు సచివాలయాల పర్యావరణ ,శానిటరీ కార్యదర్శులు కె రాంబాబు, ఎస్ దేవి, మహేష్, ఏన్ భవాని, వెంకటేశ్వర్లు, ప్రసాద్, వెంకటేష్ ,ఎం శ్రీను సూపర్వైజర్ లు సిహెచ్ నాగమణి ,భాను పాల్గొన్నారు.
Comments