ఈ నెల 21,22 న హజరత్ ఖాదర్ వల్లి ఉరుసు
నందలూరు మండలం లోని అరవపల్లి రైల్వే కాలనీ లో ఉన్న శ్రీ హజరత్ ఖాదర్ వల్లి 132 వ గొప్ప ఉరుసు కార్యక్రమానికి దర్గా కమిటీ సభ్యులు రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ద్వారా కర్ర పత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా వక్స్ బోర్డ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్ మాట్లాడుతూ ఈ నెల 21 న గంధం, 22న ఉరుసు కార్యక్రమానికి జరుపబడుతుంది అని, హిందూ ముస్లిం లు కలిసి మెలసి ఇక్యతగా ఈ ఉరుసు నిర్వహించడం జరుగుతుంది అని ఆయన తెలిపారు. గంధం రోజున వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఉరుసు రోజున ఖవాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగును. కావున హిందూ ముస్లిం భక్తులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు కల్లిం, నందలూరు ఎస్ ఐ అబ్దుల్ జహీర్, దుర్గా కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
Comments