ఘనంగా శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు
ప్రత్యేక అలంకరణలు గావించన పూజారులు-ప్రత్యేక బృందంచే కీర్తనల గానం - దర్శించుకున్న అశేష భక్తులు-అల్ప, భోజన వసతి గావించిన ధర్మకర్త రామచంద్రయ్య.
అన్నమయ్య జిల్లా చిట్వేలు మండల పరిధిలోని రాజుకుంట క్రాస్ రోడ్ వద్ద నిరంతర కృషివలుడు శ్రీ భక్తాంజనేయుని పరమభక్తుడు కీర్తిశేషులు మాది నేని వెంకటయ్య కుమారుడు రామచంద్రయ్య చే సుమారు రెండున్నర దశాబ్దాల పైగా నిర్మితమైన ఆలయం నందు నిత్యం పూజలందుకుంటున్న శ్రీ వీరాంజనేయ దేవస్థానం నందు ఈరోజు హనుమంతుని జయంతి ఉత్సవాలను ఆలయ ధర్మకర్త రామచంద్ర స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించగా మండల వ్యాప్తంగా అశేష భక్త జనం స్వామివారిని దర్శించుకున్నారు.
వేకువజాము నుంచే ఆలయ పూజారులు వినయ్ కుమార్, ఉదయ్ లు మూల విగ్రహానికి నూతన వస్త్రాలతో ప్రత్యేక పూలతో సరికొత్తగా అలంకరించి సుప్రభాతసేవ మొదలు ప్రత్యేక పూజలు, మంగళ హారతులు,నైవేద్య వితరణ గావించారు. భక్తులు చేయించిన వెండి తమలపాకుల మాల ఎంతో ఆకర్షణగా నిలిచింది.
నారాయణ నెల్లూరు గ్రామానికి చెందిన భజన బృందం వారు శ్రీరాముని, ఆంజనేయుని స్తుతిస్తూ చేసిన గానం యావత్ భక్తులను మైమరిపించింది. బజన బృందం వారు పాడిన పాటలకు భక్తులందరూ మమేకమై వారితో కలిసి భజనలు చేస్తూ భక్తిపారవశ్యలుయ్యారు.
ఆలయ ధర్మకర్త రామచంద్రయ్య దేవాలయా దర్శనానికి విచ్చేసిన భక్తులందరికీ ఉదయం అల్పాహారం మధ్యాహ్నం షడ్రుచులతో కూడిన పసందైన భోజనాన్ని అందించారు. చక్కని పాటలతో, కమ్మని భోజనంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులు భగవంతుని నామస్మరణ తో ప్రత్యేకంగా గడిపారు. మహిళలు పొంగుబాళ్ళను పెట్టి స్వామికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమ నిర్వహణలో ధర్మకర్త రామచంద్రయ్యకు బంధువులైన కొండేటి వెంకటయ్య, మాదినేని రమణయ్య, మాది నేని సుబ్బరాయుడు, మాది నేని వెంకటరమణ మరియు రాజుకుంట, అనుంపల్లి గ్రామ ప్రజలు చేయూత నందించారు.
మండల పరిధిలో పలు చోట్ల ---
కాగా మండల పరిధిలోని తిమ్మాయపాలెం క్రాస్ రోడ్ వద్ద శ్రీ దత్త గిరి నారాయణ ఆశ్రమం నందు నూతనంగా వెలసిన ఆంజనేయస్వామి విగ్రహానికి ధర్మకర్త నారాయణమ్మ ఆధ్వర్యంలో విశేషంగా పూజలు నిర్వహించారు. మండల వ్యాప్తంగా భక్తులు దర్శించుకున్నారు.
చిట్వేలి గ్రామం బ్రాహ్మణ వీధిలో వెలసిన ఆంజనేయుని ఆలయం నందు హనుమాన్ జయంతి సందర్భంగా యువత ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించి భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించి వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు.
Comments