కేంద్రీయ విద్యాలయ భవనానికి స్థలం కేటాయింపు పై హర్షం
రాజంపేట:
మండల పరిధిలోని పోలి గ్రామంలో కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించడం పట్ల బిజెపి రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతు గుంట రమేష్ నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన జిల్లా కలెక్టర్ గిరీశా పిఎస్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సర్వే నెంబర్ 1802/4, 1802/5 మరియు 1813 లో ఉన్న 7.32 ఎకరాల భూమిని పాఠశాల సాధించడానికి కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్రీయ విద్యాలయ పాఠశాల నేటి వరకు అద్దె భవనాలలో నిర్వహిస్తూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని, పోలి గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో పాఠశాల పాఠశాల ఏర్పాటు చేయడం వలన విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యనభ్యసించగలుగుతారని తెలిపారు.
Comments