విద్యార్థి దశ నుంచే మానవతా విలువలు అలవాడాలి - హెల్పింగ్ హ్యాండ్స్
ప్రసన్న ఆంధ్ర -రాజంపేట :
విద్యార్థి దశ నుంచే మానవతా విలువలు అలవాడాలని హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు పలుకూరు వెంకటరమణ తెలియజేశారు. శుక్రవారం జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్లో 8, 9, 10 వ తరగతి విద్యార్థులకు చదువు-సంస్కారం, మానవతా విలువలు అనే అంశాల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించి విద్యా సామాగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదివి పది ఫలితాలలో మెరుగైన ఫలితాలు సాధించాలని తెలిపారు. సంస్కారం లేని చదువు వాసన లేని పూవు వంటిదని., విద్యార్థులు వినయ విధేయతలతో మెలగాలని సూచించారు. 2023 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో 95 శాతం పైన మార్పులు పొందిన వారికి హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలోరూ 5 వేలు నగదు పారితో పారితోషికం తో పాటు ప్రశంసా పత్రాలను అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్ అబ్దుల్లా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comentarios