top of page
Writer's pictureEDITOR

బెంగళూరు నడిరోడ్డుపై అమానవీయ ఘటన

Hit and Run

బెంగళూరు నడిరోడ్డుపై అమానవీయ ఘటన

75 ఏళ్ల వృద్దుడిని బైక్‌తో లాక్కెళ్లిన యువకుడు

బెంగళూర్‌లో నడిరోడ్డుపై అమానవీయ ఘటన జరిగింది. ఓ వ్యక్తిని స్కూటీ చాలా దూరం ఈడ్చకెళ్లిన దృశ్యాలు సంచలనంగా మారాయి. ముత్తప్ప అనే 75 ఏళ్ల వృద్దుడిని చాలా దూరం స్కూటీతో ఈడ్చుకెళ్లాడు సోహెల్‌ అనే యువకుడు. ముత్తప్ప కారును స్కూటీపై వెళ్తున్న సోహెల్‌ ఢీకొట్టాడు. ఇలా ఎందుకు చేశావని ప్రశ్నించిన ముత్తప్ప స్కూటీకి పట్టుకునేందుకు ప్రయత్నించాడు. కాని సోహెల్‌ స్కూటీని ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. ఈ ఘటన సోషల్‌మీడయాలో వైరల్‌ అయ్యింది. చివరకు పోలీసులు సోహెల్‌ను పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు.

బైక్‌ రైడర్‌ కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన నగరంలోని మాగడి రోడ్డు టోల్‌ప్లాజా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టోల్ గేట్ సమీపంలో ఓ బైకర్ టాటా సుమోను ఢీకొట్టాడు. అతను రైడర్‌ను ప్రశ్నించడానికి వెళ్లగా.. అతను బైక్‌పై ఎక్కి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో కారు డ్రైవర్‌ బైక్‌ను వెనుక నుంచి పట్టుకోవడంతో బైక్‌పై వెళ్లే వ్యక్తి ఆ వ్యక్తిని కిలోమీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. అదేంటంటే.. టోల్ గేట్ దగ్గర నుంచి హోసల్లి మెట్రో స్టేషన్ వరకు లాకెళ్లాడు. ఈ ఘటన ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసును తలపిస్తోంది.


టోల్ గేట్ సమీపంలో టాటా సుమోను బైక్‌తో ఢీ కొట్టాడు సోహెల్‌. ఈ సమయంలో టాటా సుమో డ్రైవర్ ముత్తప్ప కారు దిగి బైకర్‌ను ప్రశ్నించగా.. బైక్‌పై ఎక్కి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో బైకర్‌ను పట్టుకునే ప్రయత్నంలో బైక్‌ వెనుక భాగం పట్టుకున్నాడు ముత్తయ్య. ముత్తయ్య పట్టుకున్నది గమనించిన సోహెల్ మరింత వేగం పెంచాడు. దీంతో ఆ వ్యక్తిని మాగాడి రోడ్డు టోల్ గేట్ దగ్గర నుంచి హోసల్లి మెట్రో స్టేషన్ వరకు బైక్ రైడర్ ఈడ్చుకెళ్లి క్రూరంగా ప్రవర్తించాడు.

డ్రైవర్‌ను బైక్‌పై ఈడ్చుకెళ్లడం చూసిన ఇతర వాహనదారులు బైక్‌ను ఆపి ప్రశ్నించారు. సమాచారం అందుకున్న విజయనగరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపి తదుపరి చర్యలు చేపట్టారు. బైక్‌కు వెనుకకు వేలాడదీసి ఒకటిన్నర కి.మీ దూరం ఈడ్చుకెళ్లిన టాటాసుమో డ్రైవర్‌కు గాయాలై ఆసుపత్రిలో చేరాడు.


పోలీసులు పట్టుకోవడానికి రావడంతో సోహెల్ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగాడు. దీంతో పోలీసులు అతడిని కూడా ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు ఈ ఇద్దరినీ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. బైక్ రైడర్‌ను బ్యాటరాయణపూర్‌లో నివాసం ఉండే సుహైల్ అలియాస్ సాహిల్ సయ్యద్‌గా గుర్తించారు, అతను సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.


39 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page