top of page
Writer's pictureEDITOR

పిత్తాశయంలో రాళ్లుంటే ఆయుర్వేదం నివారణకు సలహాలు

పిత్తాశయంలో రాళ్లుంటే ఆయుర్వేదం

నివారణకు సలహాలు


అసలు_రాళ్లు_ఏర్పడకుండా_ఉండాలంటే_ఏంచేయాలి?

ఇలాంటి ప్రశ్నలు అప్పుడో ఇప్పుడో అందరిలోనూ పుడుతూనే ఉంటాయి. నిజానికి పిత్తాశయం శరీరంలో అతి చిన్న విభాగమే అయినా, అందులో ఏదైనా సమస్య త తెత్తినప్పుడు కలిగే దుష్పరిణామాలు తక్కువేమీ కాదు.

పిత్తాశయం(గాల్‌బ్లాడర్) పొట్టకు కుడివైపున లివర్ కింది భాగంలో బే రిపండు ఆకారంలో ఉంటుంది. కాలేయం నుంచి ప్రసరించే పైత్యరసాన్ని పిత్తాశయం నిలువ ఉంచుతుంది. ఆహారం తీసుకున్నప్పుడు ముఖ్యంగా కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు, జీర్ణక్రియకు తోడ్పడేందుకు ఆ నిలువ ఉంచుకున్న పైత్యరసాన్ని పిత్తాశయం బయటకు పంపుతుంది.పైత్యరసంలో నీరు, కొలెస్టరాల్, ఫ్యాట్స్, బైల్ సాల్ట్స్, ప్రొటీన్స్, బైల్‌రూబిన్‌లు ఒక నిర్ణీత పరిమాణంలో ఉంటాయి. పైత్యరసంలో కొలెస్టరాల్, బైల్‌రూబిన్ ఎక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు పైత్యరసం గట్టిపడి రాళ్లుగా మారుతుంది. పిత్తాశయంలో కొలెస్టరాల్ రాళ్లు, పిగ్మెంట్ రాళ్లు అంటూ రెండు రకాల రాళ్లు ఏర్పడతాయి. కొలెస్టరాల్ రాళ్లు కాస్త పెద్దవిగానే ఉంటాయి. కొలెస్టరాల్ ఘనీభవించగా ఏర్పడిన రాళ్లు ఇవి. పిగ్మెంట్ రాళ్లు బైల్‌రూబిన్ వల్ల ఏర్పడతాయి. పిత్తాశయంలో ఒకటి లేక రెండు పెద్ద రాళ్లు ఏర్పడవచ్చు. ఒకవేళ చిన్నసైజులో ఉంటే అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఏర్పడవచ్చు.

1. పిత్తాశయము (గాల్ బ్లాడర్) లో రాళ్ళు ఆయుర్వేదం నివారణ

అతి ముఖ్యమైన గ్రంధులలో కాలేయము ఒకటి.ఇది పైత్య రసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పైత్యరసాన్ని పిత్తాశయము నిల్వ చేస్తుంది. పిత్తాశాయములో ఒక్కో సారి ఈ రసము గట్టి పడి రాళ్ళు లాగా మారుతుంది.

గాల్ బ్లాడర్ లో Bile juice, bile salts, కొవ్వు కణాలు, నీరు వుంటాయి. గాల్ బ్లాడర్ లో సరిగా కదలికలు లేకపోవడం గోడలు గట్టి పడడం, పదార్ధములో మార్పుల వలన రాళ్ళు ఏర్పడతాయి.

ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క కదలికల తేడాల వలన సమస్యలు ఏర్పడతాయి.

మద్యపానం అలవాటు, మధుమేహ వ్యాధి వున్నవాళ్ళలో ఈ రాళ్ళు ఏర్పడే అవకాశాలు ఎక్కువ.

ఒబేసిటీ ని అకస్మాత్తుగా తగ్గించడం వలన కూడా ఈ సమస్య ఏర్పడుతుంది.

లక్షణాలు


ఈ సమస్య వున్నవాళ్ళకు అన్నం తిన్న వెంటనే పొట్టలో కుడి పక్క నొప్పిగా వుంటుంది. కడుపు ఉబ్బరింపు, వాంతులు కావడం, మలము నల్లగా రావడం, చలి జ్వరం, పచ్చకార్లు రావడం జరుగుతుంది. వీపు మీద నొప్పి రావడం జరుగుతుంది.


నారికేళ లవణం

లేతగా కాకుండా, ముదురుగా కాకుండా మధ్యరకంగా వున్న కొబ్బరి కాయను తీసుకోవాలి. దాని పై వున్న పీచును తొలగించి ఒక కంటిలో రంధ్రం చెయ్యాలి. కాయలోని నీళ్ళను తీసేయ్యాలి. కొబ్బారి కాయను సైంధవ లవణం పొడితో నింపాలి.

ఒక పలుచని గుడ్డను తీసుకొని మెత్తటి బంకమట్టి పూసి టెంకాయ కనబడకుండా ఆ గుడ్డను చుట్టాలి. బాగా ఆరనివ్వాలి. 10 15 ఆవు పిడకలు తెచ్చి కొబ్బరి కాయ చుట్ట్టు పేర్చి పుటం వెయ్యాలి. పుటాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత మట్టిని తొలగించి కాయను పగులగొట్టి కొబ్బరిని తీయాలి. కొబ్బరి మాడి వుంటుంది.

దానిని పొడి చేసి సీసాలో భద్ర పరచుకోవాలి.

పావు టీ స్పూను పొడిని అరగ్లాసు మజ్జిగలో కలిపి ఆహారానికి ముందుగాని, తరువాతగాని సేవించాలి.

ఈ విధంగా నెల రోజులు వాడితే ఆపరేషన్ అవసరం లేకుండా నివారించుకోవచ్చు.

దీనిని వాడడం వలన అజీర్ణము, పరిణామ శూల మొదలగునవి నివారింప బడతాయి. గాస్త్రిక్ ఎంజైమ్స్ సరిగా ఉత్పత్తి అయ్యేట్లు చేస్తుంది.

పరిణామ శూల అనగా అన్నము తిన్న తరువాత క్రమం తప్పకుండా కడుపులో నొప్పి రావడం.

2.-పిత్తాశయం ఆరోగ్యంగా ఉండాలంటే

జాజికాయ

జాపత్రి

పచ్చకర్పూరం

అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి నూరి నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు కందిగింజంత మాత్ర వేసుకోవాలి. ఈ విధంగా 40 రోజులు వాడాలి.


రాళ్లు_ఎందుకు_ఏర్పడతాయి?

మహిళల్లో ముఖ్యంగా 20 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సున్న వారిలో ఈ రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయి. అధిక బరువు ఉన్న వారిలో ఏర్పడటానికి అవకాశం చాలా ఎక్కువ. గర్భధారణ సమయంలోఅధికంగా విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్, గర్భనిరోధక మాత్రలు, హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ వంటివి పైత్యరసంలో ఉండే కొలెస్టరాల్ నిలువల్ని పెంచుతాయి. దీనివల్ల పిత్తాశయంలో కొవ్వు నిలువ ఉండిపోతుంది. చివరకు కొవ్వు రాళ్లుగా మారుతుంది. పిత్త సంబంధ ఇన్‌ఫెక్షన్లతో బాధపడేవారిలో, సికిల్ సెల్ ఎనీమియా వంటి జన్యు సంబంధమైన రక్త వ్యాధులతో

బాధపడేవారిలోనూ పిగ్మెంట్ రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. కొలెస్టరాల్‌ను తగ్గించే మందుల వల్ల కూడా గాల్‌స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

ఇవీ_లక్షణాలు


పిత్తాశయంలో ఏర్పడే రాళ్లలో చాలా వరకు ఏ లక్షణాలూ కనిపించవు. కాకపోతే, ఇతర గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చినపుడు వాటి కోసం చేసిన పరీక్షల్లో ఇవి బయటపడతాయి. ఇటువంటి వాటికి చికిత్స అవసరం లేదు. అలాకాకుండా అన్నం తిన్న వెంటనే కడుపు ఉబ్బరం, తేన్పులు, అజీర్ణం, వికారం వంటి లక్షణాలుంటే చికిత్స అవసరం అవుతుంది. కడుపు నొప్పి, వాంతులు ఉంటే తీవ్రమైన లక్షణాలుగా పరిగణించాల్సి ఉంటుంది. సాధారణంగా నొప్పి కడుపు పైభాగంలో వస్తుంది. ఒక్కోసారి కుడివైపున వస్తూ కుడి భుజంకు పాకుతూ ఉంటుంది. భోజనం చేసిన తరువాత ముఖ్యంగా కొవ్వు ఎక్కువగా ఆహారం తీసుకున్నప్పుడు ఈ లక్షణం కనిపిస్తూ ఉంటుంది. ఈ తరహా నొప్పిని బైలరీ కోలిక్ అంటారు. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడినపుడు పైత్యరసం బయటకు పోకుండా బ్లాక్ అవుతుంది. ఇది జాండిస్‌కు దారితీస్తుంది. జ్వరం, కళ్లు పచ్చగా మారడం, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.

3. చికిత్స ఎలా ఉంటుంది


గాల్‌బ్లాడర్‌లో ఉండే అన్ని రాళ్ల వల్ల ప్రమాదం ఉండదు. సైలెంట్ గాల్‌స్టోన్స్ ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఇలాంటి వాటికి చికిత్స అవసరం లేదు. ఒకవేళ రాళ్ల వల్ల సమస్యలు ప్రారంభమవుతున్నట్లయితే చికిత్స అవసరమవుతుంది. గాల్‌స్టోన్స్‌తో సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే ఆపరేషన్ ద్వారా గాల్‌బ్లాడర్‌ను తొలగించడం ఒక్కటే మార్గమని డాక్టర్లు చెబుతారు. . రాళ్లను తొలగిస్తే మళ్లీ రాళ్లు ఏర్పడే అవకాశం ఉన్నందువల్ల . కాబట్టి పిత్తాశయంను తొలగించడమే మంచిదని వాళ్లు చెబుతారు. . ఈ ఆపరేషన్‌ను ఓపెన్ సర్జరీ విధానంలోనూ, కీహోల్ విధానంలోనూ చేస్తుంటారు. ఆపరేషన్ చేయించుకోవడం ఇష్టం లేని వారికి ఒక దశ వరకు మందులే సూచిస్తారు. క్రమంతప్పకుండా మందులు వాడటం వల్ల రాళ్లు కరిగిపోతాయి. అంతేకాకుండా తక్కువ పరిమాణంలో ఉన్న రాళ్లు మాత్రమే మందులతో కరుగుతాయి.


మరిన్ని సలహాలు సూచనల కొరకు సంప్రదించండి


నవీన్ నడిమింటి

ఫోన్ -9703706660

913 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page