కృష్ణానది ఇసుక తిన్నెలలో మానవ అస్థిపంజరం కలకలం
మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ తాడేపల్లి పట్టణం సీతానగరం రైల్వే బ్రిడ్జి క్రింద నది ఇసుక తిన్నెలలో ఓ మానవ కళేబరం పూర్తిగా ఎముకల గూడులా మారి బయటకు కనిపిస్తుంది. స్థానికుల సమాచారం మేరకు మీడియా ప్రతినిధులకు ఈ విషయం తెలియడంతో ఇసుక తిన్నెలలో కూరుకుపోయి ఉన్న మానవ అస్థిపంజరం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎముకల గూడు మహిళదా...? పురుషుడిదా...? ప్రమాదమా...? హత్యా...? అనే విషయాలు పోలీసుల పరిశీలనలో తేలాల్సిఉంది. ఏది ఏమైనా గతంలో మాదిరి కృష్ణా తీర ప్రాంతంలో పోలీసులు నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని సాయం సంధ్య వేళల్లో నదీ తీర ప్రాంతంలో విహారానికి వచ్చే ప్రేమ జంటల పట్ల పూర్తి నిఘా ఏర్పాటు చేయాలని, నది వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని గతంలో ఏర్పాటు చేసిన ప్రమాద సూచిక బోర్డులు ఉన్నాయా...?లేదా...?అనేది స్థానిక పోలీసులు పరిగణలోకి తీసుకుని, ప్రస్తుతం బయట పడిన అస్థిపంజరం వ్యవహారం కూడా తేల్చాల్సిన అవసరం ఉందని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.
Comments