ఐఏఎస్ 62 వ ర్యాంకర్ ఈ శ్రీ పూజ.
ఆది గురువులకు పాదాభివందనం.
తోటి మిత్రులతో ఆత్మీయులతో పలకరింపు.
ఐఏఎస్ సాధించాలన్న వారికి విలువైన సూచనలు.
తన తండ్రి గారే మార్గదర్శమన్న శ్రీ పూజ.
భారతదేశంలో నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ నందు అరవై రెండవ ర్యాంకు సాధించిన తిరుమణి శ్రీపూజ తన తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, రాజరాజేశ్వరి తో కలసి చిట్వేలు నందు తనకు విద్యను బోధించిన ఆదిగురువుల తోనూ తనతో పాటు విద్యనభ్యసించిన మిత్రులతోనూ, తన తండ్రి గారు ఉద్యోగ విధులలో అనుబంధాలను పంచుకున్న ఆత్మీయులు తోనూ తను సాధించిన విజయాన్ని ఈరోజు మధ్యాహ్నం చిట్వేలి వాసులు స్థానిక శివాలయం నందు ఏర్పాటుచేసిన ఆత్మీయ సన్మాన సభలో తన విజయ గాథను అందరితో పంచుకుంటూ యువతకు దిశానిర్దేశం చేస్తూ నేను చదివింది కూడా సామాన్య పాఠశాలలోనే, మీ అందరి తోనేనని చిన్నతనం నుంచే తన తండ్రినీ మార్గదర్శిగా అనుసరించి చదువు కొనసాగించానని ఇంజనీరింగ్ తర్వాత ఢిల్లీలోని శ్రీరామ్ ఐఏఎస్ అకాడమీ నందు ఆంత్రోపాలజీ సబ్జెక్టును ఎంచుకుని 2020 సంవత్సరం లో ఇంటర్వ్యూ వరకు వెళ్లి 2021లో తిరిగి ప్రయత్నించి లక్ష్యాన్ని సాధించానని తెలిపారు.
శ్రీ పూజ విజయంపై తండ్రి వెంకటేశ్వర్లు మాటల్లో: నేను 2008లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష రాసినప్పుడు ప్రిలిమినరీ లోగల మెంటల్ ఎబిలిటీ 30 మార్కులకు గాను నేను కరెక్ట్ చేయలేని ప్రశ్నలకు కూడా శ్రీ పూజ ఎనిమిదో తరగతిలో ఉండగానే అన్నింటికీ సమాధానం చేసిందని ఆ రోజే తనకు విలువైన జీవితం ఉందన్న ఆలోచన ఐఏఎస్ చదివించాలని బీజం నాలో కలిగాయని తొమ్మిదవ తరగతి లో ఉన్నపుడు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ టాలెంట్ టెస్ట్(NTSE) నందు మొదటి ర్యాంకు సాధించిందని నా కుమారుడు భాలు వరుణ్ ఐఐటీలో 9వ ర్యాంకు సాధించారని వారి ఇరువురుకి వారి టాలెంట్ ను గుర్తించిన చిట్వేలి శ్రీ సాయి వికాస్ మరియు రాజంపేట లోని రాజువిద్యాసంస్థలు ఉచితంగానే విద్యను బోధించారని అలా కొనసాగిన శ్రిపూజ విద్యాభ్యాసం ఐఏఎస్ లక్ష్యాన్ని సాధించిందని తెలుపుతూ తమ పిల్లలకు ప్రతితల్లిదండ్రులు చదువుకు కావలసిన మంచి వాతావరణం కల్పించాలని ఉన్నత లక్ష్యాన్ని వారికి బీజంగా వేసి సాధించేందుకు మన సహాయం అందించాలని అన్నారు.
ఐఏఎస్ ముత్యాల రావు నాకు ఆదర్శం: శ్రీ పూజ మాట్లాడుతూ తన తండ్రి గారు తాను సాధించాలన్న లక్ష్యాన్ని 2006లో ఐఏఎస్ ఆఫీసర్ గా ఎదిగిన ముత్యాలరావు జీవిత సత్యాన్ని నాకు పాఠంగా నేర్పారని నా లక్ష్యసాధనలో ఆయనే మార్గదర్శమని అన్నారు.
నా ఉద్యోగాన్ని నీతి నిజాయితీతో నిర్వహిస్తా: శ్రీ పూజ మాట్లాడుతూ తాను నిర్వహించబోయే ఐఏఎస్ ఉద్యోగంలో ఎక్కడ పని చేసినా ఉద్యోగ బాధ్యతలను నీతి నిజాయితీతో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కచ్చితత్వాన్ని అనుసరిస్తూ నిక్కచ్చిగా నా విధులను నిర్వహిస్తానని ఎలాంటి మచ్చ లేకుండా పేరు సంపాదిస్తానని అన్నారు. మహిళా అభివృద్ధి కోసం మహిళా విద్య కోసం ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.
ఆది గురువులకు పాదాభివందనం: తాను ఐఏఎస్ అయినా తల్లి తండ్రి తరువాత అంతటి ప్రాధాన్యత గురువుకే అన్న వాస్తవాన్ని నిజం చేస్తూ విద్యను బోధించిన గురువులైన బాబు, విశ్వనాదం,రాజా,జయ చంద్ర,నరసరామయ్య, ఎ ప్రసాద్ తదితరులకు పాదాభివందనం చేసి గురు శిష్యుల అనుబంధాన్ని అందరికీ గుర్తు చేసింది.
ఈ సన్మాన కార్యక్రమం లో చిట్వేలు మండల పరిధిలోని వైసిపి నాయకులు ఎల్వి మోహన్ రెడ్డి చక్రపాణి రెడ్డి బిజెపి నాయకులు తొంబరపు సుబ్బరాయుడు, ఆకేపాటి వెంకట రెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్, (సి ఎ )తుంగా సిద్దయ్య నాయుడు, సి హెచ్ ఎస్ బాధ్యులు గాడి ఇంతియాజ్, మానవతా బాధ్యులు ముని రావు, చిన్ననాటి స్నేహితులు ఆత్మీయులు తన తండ్రికి ఉద్యోగ సహచరులు మండలంలోని పాత్రికేయులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments