వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
సూపర్వైజర్ పోస్టులపై విచారణ జరపాలి
డిగ్రీ పిజి వుంది పరీక్ష రాసిన వారి జాబితా కనుమరుగు
అధికారులు నాయకులు ఇష్ట ప్రకారం జాబితా విడుదల చేస్తే ఇక పరీక్షలు ఎందుకు
గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులలో మాయాజాలం
సూపర్వైజర్ పోస్టులపై విచారణ జరిపించాలి అంటూ AITUC ప్రొద్దుటూరు పట్టణ సమితి నేడు ఎమ్మార్వో కార్యాలయం నందు ఆర్డిఓ శ్రీనివాసులుకు వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేసిన AITUC పట్టణ కార్యదర్శి పోరుమామిళ్ళ సుబ్బారాయుడు, ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ICDS సెప్టెంబర్ 5న అంగన్ వాడి టీచర్ల సూపర్వైజర్ల పోస్టుల పదోన్నతులకై నీటిపికేషన్ జారి చేసినదని, అయితే ఈ పదోన్నతులకై అప్లై చేసుకున్న అంగన్ వాడి టీచర్లకు సెప్టెంబర్ 18న పరీక్ష నిర్వహించగా. ఉన్న ఫలంగా హడావిడిగా 25/09/2022న ఆన్లైన్ పరీక్ష వ్రాసిన అభ్యర్థుల జాబితాకు సంబందించిన 'కీ' గాని, రోస్టర్ విధానముగాని వివరాలు విడుదల చేయకుండా, వారికి వారే మెరిట్ లిస్టు అంటూ ఎంపిక చేసి గోప్యంగా ఉంచారని, పరీక్షకు హాజరయిన అభ్యర్థుల స్పోకెన్ ఇంగ్లీష్ కు సంబంధించిన వీడియోలు అన్ని అప్లోడ్ చేయకుండా. వారు అనుకున్న వారికి మాత్రమే అప్లోడ్ చేసి అధికారులు అర్హులయిన వారికి తీవ్రమైన అన్యాయం చేశారన్నారు.
ఐసీడీఎస్ అధికారులు ప్రకటించిన వారికి సెప్టెంబర్ 30న అప్పాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తామని ప్రకటిస్తున్నారని. అధికారుల చర్యల మూలంగా అంగన్వాడి కార్యకర్తలు సూపర్ వైజర్ గా పదోన్నతులు కోల్పోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విధి విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఐసీడీఎస్ శాఖాధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకుని అధికారులు ప్రకటించిన జాబితాను రద్దు చేసి తిరిగి పరీక్షలు నిర్వహించగలరని AITUC పట్టణ కార్యదర్శి పోరుమామిళ్ళ సుబ్బారాయుడు కోరారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు తులసి, శ్రీవాణి, సుజాత, ఓబుళమ్మ, మల్లికా, శ్వేతా, ఏఐటీయూసీ విజయ తదితరులు పాల్గొన్నారు.
Comments