బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం - ఐసిడిఎస్ సూపర్వైజర్ నిర్మల.
చదువుతూ మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతూ ఆడుకునే వయసులో ఆడపిల్లలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని ఐసిడిఎస్ సూపర్వైజర్ నిర్మల పేర్కొన్నారు.
మహిళా వాలెంటరీ పోలీస్ అమరావతి మాట్లాడుతూ ఆడపిల్లలకు చిన్న వయసులో వివాహం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని తద్వారా పిల్లలు అంగవైకల్యంతో పుడతారని పేర్కొన్నారు. హైస్కూల్ ఉపాధ్యాయరాలు గాయత్రి మాట్లాడుతూ "మట్టికుండను చేసిన వెంటనే ఉపయోగించలేము కదా..!! కాల్చి ఆరిన తర్వాత అందులో నీరు నింపి చల్లని నీరు త్రాగగలం. అలాగే ఆడ పిల్లల వయసు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే పెళ్లి చేయాలి తప్ప ముందుగా తల్లిదండ్రులు ఆ విషయాన్ని ఆలోచించకూడదు అని అన్నారు.
అంగన్వాడి ఉపాధ్యాయురాలు సుధామణి మాట్లాడుతూ ప్రతి ఆడపిల్ల తన ఆరోగ్యంపై, ఎదుగుదలపై సమాజంలో జరుగుతున్న ఇబ్బందులపై అవగాహన కలిగి ఉండాలని ఏదైనా ఇబ్బంది తలెత్తే 1098 ఈ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని అన్నారు ఈ కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ నిర్మల్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఉన్నత పాఠశాల అధ్యాపకులు సులోచన, శ్రీదేవి, గాయత్రి, కరుణమ్మ, పద్మజా, మంజు భార్గవి, మహిళా పోలీస్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
Comentários