సంక్షోభంలోను సంక్షేమం అభివృద్ధికి రెక్కలు - ఎమ్మెల్యే వరద
కడప జిల్లా, ప్రొద్దుటూరు
సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రజలు కోరుకున్న పాలనకు వంద రోజులు అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు తలపెట్టిన ఇది మంచి ప్రభుత్వం - ప్రజా వేదిక కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వంలో గడచిన వందరోజుల ప్రజాపాలనలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలు ప్రజలకు తెలియచేయాలనే తలంపుతో, ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని దొరసాని పల్లె గ్రామపంచాయతీ నందు ప్రజా వేదిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అధికారులు ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి హాజరై గడిచిన వందరోజుల కాలంలో తమ ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయో లేదో అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజా వేదికను ఉద్దేశించి మాట్లాడుతూ, నిరుద్యోగులకు మెగా డీఎస్సీ, ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు, పంచాయతీలకు నిధులు, పేదలకు పెరిగిన పెన్షన్ల అమలు, సమస్యల వరదపై కూటమి ప్రభుత్వ విజయాల గురించి సభకు హాజరైన ప్రజలకు తెలిపారు. సమావేశానికి పెద్ద ఎత్తున దొరసానిపల్లి గ్రామ ప్రజలు, టిడిపి నాయకులు హాజరయ్యారు.
Comentários